11 die of electrocution during procession in Thanjavur తంజావూరులో విషాదం.. విద్యుద్ఘాతంతో 11 మంది మృతి

11 killed 15 injured in electrocution during procession in thanjavur

Tragedy at Kaliamedu temple, electrical short circuit at temple event, Kaliamedu temple fire, TN tragedies, TN police, Thanjavur Temple News, what is electrocution?, children electrocuted Thanjavur, Kaliamedu temple, Electrocultion, Thanjavur, Charriot Procession, Tamil Saivaite saint, Thirunavukkarasar, Devotees, 11 dead, 2 children died,what happened in Thanjavur, Thanjavur news, Chennai news, Tamil Nadu, Crime

As many as 11 people were electrocuted and several others were injured during a temple festival at Kalimedu town in Tamil Nadu’s Thanjavur district. An electric wire got entangled with the temple chariot while it was being pulled by devotees, resulting in the death of 11 people, including two children.

తంజావూరు దేవతా విగ్రహ ఊరేగింపులో విషాదం.. విద్యుద్ఘాతంతో 11 మంది మృతి

Posted: 04/27/2022 01:43 PM IST
11 killed 15 injured in electrocution during procession in thanjavur

తమిళనాడులోని తంజావూరులో గత రాత్రి జరిగిన ఆలయ ఉత్సవంలో తీవ్ర విషాదం నెలకొంది. అనవాయితీగా వస్తున్న ఉత్సవ ఊరేగింపును ఎంతో భక్తిశ్రద్దలతో ఉత్సాహంగా నిర్వహిస్తున్న గ్రామస్థులపై విధి పగబట్టింది. కలిమేడు ప్రాంతంలో జరిగిన ఉత్సవంలో విద్యుదాఘాతంతో 10 మంది సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తంజావూరు పక్కనున్న కలిమేడు ఎగువ ఆలయంలో ప్రతిఏడాది ఉత్సవాన్ని నిర్వహిస్తారు. వేడుకలో భాగంగా రథాన్ని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితి. అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమయ్యే రథోత్సవం తెల్లవారుజాము వరకు జరుగుతుంది. గత రాత్రి రథోత్సవం వైభవంగా ప్రారంభమైంది.

ఈ క్రమంలో తంజావూరు-పుతలూరు రహదారి పక్కన రథం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుదాఘాతంతో మంటలు అంటుకోవడంతో 11 మంది భక్తులు సజీవ దహనమయ్యారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ విషాదకర ఘటనపై భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని వెలిబుచ్చారు. తంజావూరులో ఊరేగింపులో విద్యుదాఘాతంతో చిన్నారులతో సహా ప్రాణాలు కోల్పోవడం మాటల్లో చెప్పలేని విషాదమని.. ఈ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన రాష్ట్రపతి క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశించారు..

ప్రధాని నరేంద్రమోడీ కూడా తంజావూరు ప్రమాద ఘటనపై తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉత్సాహంగా దేవుడి రథాన్ని భక్తజనం ఊరేగింపుగా తీసుకెళ్తున్న తరుణంలో ఈ దుర్ఘటన సంభవించడం చాలా బాధాకరమని ప్రధాని అవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను” అని ప్రధాన మంత్రి అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 అందజేస్తామని ప్రధాని తెలిపారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రమాదఘటనపై సమాచారం అందగానే స్థానిక పోలీసు, అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్ సిబ్బందిని అలర్ట్ చేశారు. క్షతగాత్రులకు హుటాహుటిన అసుపత్రులకు తరలించి వారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని అదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి బాధిత కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం ఘటన జరిగిన ప్రాంతంతో పాటు క్షతగాత్రులు చికిత్స పోందుతున్న ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles