Six workers killed in blast at chemical factory in Gujarat గుజరాత్ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు కార్మికుల మృతి

Gujarat 6 charred to death in blast at chemical factory in bharuchs dahej industrial area

Gujarat workers killed, Bahrauch workers death, Gujarat chemical factory blast, Gujarat news, Bharuch, fire, blast, explosion, Dahej industrial area, Gujarat chemical factory fire, Bharuch chemical factory fire, Organic Chemical Company, fire at Organic Chemical Company factory, chemical factory, chemical factory fire, Bharuch district, Ahmedabad, Dahej, Gujarat, crime

Six workers were killed in a blast which triggered a fire in a chemical factory in Gujarat’s Bharuch district on Monday, officials said. The incident took place around 3 am in the unit located in Dahej industrial area, some 235 km from Ahmedabad.

గుజరాత్ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు కార్మికుల మృతి

Posted: 04/11/2022 11:45 AM IST
Gujarat 6 charred to death in blast at chemical factory in bharuchs dahej industrial area

గుజరాత్‌లో ఓ రసాయన పరిశ్రమలో సంభవించిన పేలుడులో ఆరుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. గుజరాత్ లోని భరూచ్ జిల్లాలోని దహేజ్ పారిశ్రామిక ప్రాంతంలోని రసాయన కర్మాగారంలో ఈ విషాదకర ఘటన సంభవించింది. అహ్మదాబాద్‌కు 235 కిలోమీటర్ల దూరంలో ఉన్న దహేజ్‌లోని గుజరాత్ కెమికల్ ఫ్యాక్టరీలో ఆదివారం అర్థరాత్రి పరిశ్రమలోని రియాక్టర్ పేలుడు సంభవించడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. దహేజ్‌లోని ఆర్గానిక్ కెమికల్ కంపెనీ ఫ్యాక్టరీలో తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన సంభవించింది. పరిశ్రమలో రియాక్టర్ అకస్మాత్తుగా పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

అయితే రియాక్టర్ కు సమీపంలోనే పనిచేస్తున్న ఐదుగురు కార్మికులు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మరణించారు. కాగా మరో కార్మికుడు తీవ్రంగా గాయపడగా..అతడ్ని అసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పోందుతూ బాధిత కార్మికుడు కూడా మరణించాడని అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను నియంత్రించే చర్యలకు పూనుకున్నారు. పరిశ్రమలోని మిగతా కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కాగా ఈ ఘటనలో మరణించిన కార్మికుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అసుపత్రికి తరలించారు.  

రియాక్టర్ పేలుడుకు గల కారణాలను పోలీసు అధికారులతో పాటు ఇన్స్ పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, అగ్నిమాపక దళాలు పరిశీలిస్తున్నాయి. ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు, కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదానికి కారణాన్ని కనుగొనడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని భరూచ్ పోలీస్ సూపరింటెండెంట్ లీనా పాటిల్ తెలిపారు. సాల్వెంట్ డిస్టిలేషన్ ప్రక్రియలో రియాక్టర్ అకస్మాత్తుగా పేలిపోయిందని దీంతో రియాక్టర్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు ఘటనాస్థలంలోనే మరణించారని తెలిపారు. ఇదిలావుండగా, గత ఏడాది ఆగస్టులో బరూచ్‌లోని దహేజ్ పారిశ్రామిక ప్రాంతంలో రసాయనాల తయారీ యూనిట్‌లో పేలుడు సంభవించి ఒక కార్మికుడు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles