Balladeer Gaddar raises voice for farmers గులాబి దళం అందోళన కార్యక్రమంలో మెరిసిన ప్రజా‘గానం’

Balladeer gaddar presents in trs camp supporting farmers

Balladeer Gaddar supports TRS, Balladeer Gaddar supports farmers, Balladeer Gaddar demands centre to procure paddy, Balladeer Gaddar supports TRS cause, Balladeer Gaddar, TRS, Central Government, Farmers, Paddy Procurement, mainampally hanmanth rao, Telanagana, Politics

Years after Balladeer Gaddar is seen in a protesting camp which is backed by the ruling TRS party at Medchal today in support of farmers. The 75 Year Old demanded the Centre should take necessary steps to procure the paddy from farmers.

గులాబి దళం అందోళన కార్యక్రమంలో మెరిసిన ప్రజా‘గానం’

Posted: 04/04/2022 07:28 PM IST
Balladeer gaddar presents in trs camp supporting farmers

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సహా తెలంగాణకు మద్దతునిచ్చే పలు రాజకీయ పార్టీలతో కలసి ఉద్యమించిన ప్రజాగాయకుడు గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్ రావు.. మళ్లీ చాలాకాలం తరువాత ఇవాళ అందోళన కార్యక్రమంలో కనిపించారు. కేంద్రం తమ నిరంకుశ విధానాలను పక్కనబెట్టి తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనాల్సిందేనని అధికార టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి ఆయన మద్దతు పలికారు. తెలంగాణ ఉద్యమంలో వినిపించిన ఆయన గానం.. ఎంతోమంది ఉస్మానియా విద్యార్థులను ఉద్యమం వైపు నడిపించింది.

ఆ తరువాత ఆయన అనారోగ్య రిత్యా తెలంగాణ సాధించిన తరువాత కూడా ఇంటికే పరిమితం కాగా, మళ్లీ ఇన్నాళ్లకు తెలంగాణ రైతుల వడ్లను కేంద్రం కోనాల్సిందేనని రైతులకు తనవంతుగా మద్దతు పలుకుతూ గులాభి దళం చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో మెరిశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు మండల కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. రైతుల అకాంక్షల మేరకు రాజకీయాలను పక్కన బెట్టి కేంద్రమే వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేయాలని నిర్ణయించారు.

ఈ మేరకు అల్వాల్ మండల రెవెన్యూ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన దీక్షలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పాల్గొన్నారు. ఇదే దీక్షలో ప్రముఖ గాయకులు యుద్ధనౌక గద్దర్ పాల్గొని నిరసన దీక్షకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజను కేంద్రం కొనాల్సిందేనన్నారు. లేదంటే ఆందోళనలను తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. గద్దర్ మాట్లాడుతూ.. అరుగాలం శ్రమించి రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనన్నారు. రైతుల బాధలను చూడలేకనే నిరసన దీక్షలో పాల్గొన్నట్లు గద్దర్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles