Komati Reddy Demands CM to procure paddy రూ. వేల కోట్ల కుంభకోణాలపై పిర్యాదు చేసినా..: రేవంత్ రెడ్డి

Tpcc president revanth reddy made sensational allegation on kcr govt

TPCC President, A Revanth Redddy, TPCC chief, New Delhi, Parliament session, Komati reddy Venkat Reddy, Komatireddy Rajgopal Reddy, PM Modi, Coalgate, Singareni coal mines, Adani, Sonia Gandhi, Rahul Gandhi, Telangana Congress Telangana, Politics

TPCC President and Congress MP Revanth Reddy had made sensational allegation on KCR led state government and PM Modi led Central government tosay. Along with Bhongir MP Komatireddy Venkat reddy Revanth held a pressmeet and alleged that a Big scam greater than Coalgate had taken place in Telangana Singareni mines. Even after reporting the issue to PM and union minister not a single action been taken.

కేంద్రానికి తెలిసే.. కేసీఆర్ ప్రభుత్వం భారీ కుంభకోణాలు: రేవంత్ రెడ్డి

Posted: 03/22/2022 05:10 PM IST
Tpcc president revanth reddy made sensational allegation on kcr govt

కేంద్రం ప్రభుత్వానికి తెలిసే కేసీఆర్‌ ప్రభుత్వ అక్రమాలకు పాల్పడుతోందని అయినా రెండు పార్టీలు లోలోన సహకరించుకుంటూ.. ప్రజల ముందు పోరాటం చేస్తున్నట్లు సీన్ క్రియేట్ చేస్తున్నాయిని పీసీసీ చీఫ్​ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. దొంగసొమ్మును బీజేపి, టీఆర్ఎస్ కలిసి పంచుకుంటున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల భారీ అక్రమానికి పాల్పడిందని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ సహా కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని అరోపించారు. కేసీఆర్ సర్కార్ పైన యుద్దం చేస్తున్నామన్న బీజేపికి సాక్ష్యాధారాలతో కూడిన చిట్టా ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.

సింగరేణి బొగ్గుగనుల టెండర్లలో భారీగా అక్రమాలు జరిగాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఓ బడా వ్యాపారవేత్తకు గనులు దక్కేలా కేసీఆర్‌ సర్కార్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర ఖజానాకు గండికొడుతోందని.. కాగా ఈ కుంభకోణంలో కేంద్రంలోని అధికార బీజేపికి కూబా భాగస్వామ్యం ఉందని ఆయన సంచలన అరోపణలు చేశారు. ఆధారాలతో పాటుగా తాము అక్రమాలపై పలు పర్యాయాలు పిర్యాదు చేసినా.. కేంద్రం చర్యలు తీసుకునేందుకు ఇప్పటికీ మీనమేషాలు లెక్కబెడుతోందని అరోపించారు. అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసినా... ఎలాంటి ఫలితం లేదని పేర్కొన్నారు. 8 ఏళ్లుగా పదవిలో ఉన్న సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను ఎందుకు తొలగించట్లేదని ప్రశ్నించారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్‌ సంబంధించిన వారికే సింగరేణి కాంట్రాక్టులు దక్కాయని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రూ.50 వేల కోట్ల కాంట్రాక్టును ఒక సంస్థకు అక్రమంగా ఇచ్చారని అన్నారు. 49 శాతం వాటా ఉన్న కేంద్రం అక్రమాలను పట్టించుకోవట్లేదని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వ అక్రమాలకు కేంద్రం సహకరిస్తోందని చెప్పారు. దొంగసొమ్మును భాజపా, తెరాస కలిసి పంచుకుంటున్నాయని మండిపడ్డారు. భారీ అక్రమాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తమ ఫిర్యాదులపై స్పందించకపోతే... సుప్రీంకోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. నిబంధనలు కఠినతరం చేసి ఒక్క సంస్థే టెండర్లలో పాల్గొనేలా చేశారని తెలిపారు. కేసీఆర్‌ దోపిడీని కేంద్రంలోని భాజపా సమర్థిస్తోందని రేవంత్​ రెడ్డి ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles