Traffic Police to offer discount on pending challans వాహనాల పెండింగ్ చలాన్లపై ట్రాఫిక్ పోలీసుల డిస్కౌంట్

Hyderabad traffic police to offer discount on pending challans from march 1

Hyderabad Traffic Police, discount on traffic challans, motorists, Two Wheelers, Four Wheelers, heavy vehicles, RTC buses, push carts, not wearing a mask, waiver of 90 per cent on mask challans, telangana e-challan, traffic police, Telangana, Crime

The Traffic Police will be offering a discount on traffic challans pending against motorists from Tuesday. The Traffic Police will be extending the benefit with a waiver of 75 per cent for two wheelers, 50 per cent for four-wheelers including cars and other heavy vehicles, 70 per cent for RTC buses and 80 per cent for push carts. As for the penalty imposed for not wearing a mask, there is a waiver of 90 per cent of the amount.

వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల గుడ్ న్యూస్.. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్

Posted: 02/28/2022 04:13 PM IST
Hyderabad traffic police to offer discount on pending challans from march 1

వాహనదారులకు ఎట్టకేలకు ట్రాఫిక్ పోలీసులు గుడ్ న్యూస్ చెప్పారు. లక్షలాది వాహనాలపై కోట్లాది రూపాయల ఛలాన్లు వేసినా.. వాటిలో అరకొర మాత్రమే స్వచ్ఛంధంగా చెల్లిస్తుండగా, మిగతా వాహనాలపై పెండింగ్ లో వున్న ఛలాన్లను వసూళ్లు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అనేక విధాలుగా కష్టపడాల్సి వస్తోంది. అయితే ఇక్కడ కూడా మరో సమస్య ఉత్పన్నం అవుతోంది. ఇలా తీసుకువచ్చిన వాహనాలను ఎక్కడ పెట్టలాన్న ప్రశ్నకూడా ఉత్పన్నం అవుతోంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు భారీ ఊరట కల్పించనున్నారు.

ద్విచక్రవాహనాలతో పాటు కార్లు, అటోలు. ఇలా అన్ని రకాల వాహనాలపై పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారులకు ఊరట కల్పిస్తూ ట్రాపిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ కీలక సూచనలు చేశారు. ఆన్‌లైన్ ద్వారానే పెండింగ్ చలాన్లు చెల్లించాలని తెలిపారు. ఈ చలాన్ సిస్టమ్ ద్వారా అన్ని పెండింగ్ చలాన్‌లు చెల్లించాలని పేర్కొన్నారు. ఆన్లైన్ అనగా ఫోన్ పే & పేటీఎం, గూగుల్ పే వంటి సేవలు ఉపయోగించుకోవచ్చని, లేదా మీ సేవ, ఈ సేవలో చెల్లించవచ్చని సూచించారు. మార్చి 1వ తేదీనుంచి 30వ తేదీ వరకు ట్రాఫిక్ చలాన్ల రాయితీ అమలు అవుతుందని తెలిపారు. బైకులకు 75 శాతం రాయితీ కల్పించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles