Mulayam Singh's daughter-in-law joins BJP యూపీలో రసవత్తర రాజకీయం.. బీజేపిలోకి అఖిలేష్ యాదవ్ మరదలు

Aparna yadav married to akhilesh yadav s brother joins bjp

Aparna Yadav, BJP, UP Assembly elections 2022, UP Election, UP Election 2022, Aparna Yadav News, Aparna Yadav joins BJP, Aparna Yadav Latest News, Aparna Yadav News Today, UP Polls, UP Assembly Election 2022, UP Assembly Election, Uttar Pradesh, politics

Aparna Yadav, married to Akhilesh Yadav's brother, joined the BJP today, in a huge blow to the Samajwadi Party just weeks before the Uttar Pradesh election. Aparna Yadav is the wife of Akhilesh Yadav's brother Pratik Yadav, the younger son of Samajwadi Party patriarch Mulayam Singh Yadav. BJP leaders, welcoming her to the party, referred to her as "Mulayam Singh's bahu (daughter-in-law)".

ఉత్తర్ ప్రదేశ్ లో రసవత్తర రాజకీయం.. బీజేపిలోకి అఖిలేష్ యాదవ్ మరదలు

Posted: 01/19/2022 10:15 AM IST
Aparna yadav married to akhilesh yadav s brother joins bjp

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో రసవత్తర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల షడ్యూల్డు వెలువడిన వెంటనే అధికార బీజేపికి చెందిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నుంచి ఏకంగా ముగ్గురు బిసి మంత్రులు సహా ఎనమిది మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఈ క్రమంలో తీవ్ర పరాభవానికి గురైన బీజేపి కూడా పావులు కదుపుతూ ఏకంగా సమాజ్ వాదీ వ్యవస్తాపక అధ్యక్షుడు ములాయం సింగ్ కు షాకిచ్చేలా చేసింది. ములాయం చిన్నకొడుకు ప్రతీక్ యాదవ్ సతీమణి అపర్ణ యాదవ్ కు తమ పార్టీలో చేరేలా పావులు కదిపింది.

ఈ సారి ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీల మధ్య పోటీ నెలకొంది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ పావులు కదుపుతుండగా, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీ కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపికి తగిలిన వరుస ఎదురుదెబ్బలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అఖిలేష్ యాదవ్ సోదరుడు.. ములాయంసింగ్ చిన్నకుమారుడు ప్రతీక్ యాదవ్ సతీమణి అపర్ణ యాదవ్ ను తమ పార్టీలోకి చేరేలా చేయడంలో బీజేపి సఫలీకృతమయ్యింది. దీంతో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీకి ఎదురుదెబ్బ తగలింది.

ఇవాళ ఉదయం అమె బీజేపి సభ్యత్వాన్ని తీసుకున్నారు. పార్టీలో చేరడంతో అమెకు సాదరంగా ఆహ్వానించిన బీజేపీ నేతలు అమెకు పార్టీ ఖండువాను కప్పారు. ఉత్ర్ ప్రదేవ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ మౌర్య సమక్షంలో అమె బీజేపిలో చేరారు. ఈ సందర్భంగా తాను ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలకు ఆకర్షితురాలినై పార్టీలో చేరాననని అమె అన్నారు. ఈ సందర్భంగా ఢిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య మాట్లాడుతూ అఖిలేష్ యాదవ్ తన కుటుంబలోనూ అపజయం పాలయ్యారని, ఇక ఇటు రాజకీయాల్లోనూ ఆయన అపజయాన్ని మూటగట్టుకోనున్నారని విమర్శలు చేశారు, అనేక రోజుల పాటు అమెతో చర్చలు నిర్వహించిన తరువాత అపర్ణ యాదవ్ బీజేపిలోకి చేరారని తెలిపారు.

అయితే, అపర్ణ లక్నో కాంటోన్మెంట్ అసెంబ్లీ శాసనసభా స్థానం టికెట్‌ ఆశిస్తున్నట్లు సమాచారం. 2017లో అపర్ణ అదే స్థానం నుంచి పోటీ చేసి.. బీజేపీకి చెందిన రీటా బహుగుణ జోషి చేతిలో ఓటమిని చవిచూశారు. ఎన్నికల్లో అపర్ణకు 63వేలకుపైగా ఓట్లు పోలయ్యాయయి. అపర్ణ బీజేపీలో చేరితే.. యూపీలో అధికారంలోకి రావాలని చూస్తున్న అఖిల్‌ యాదవ్‌కు ఈ పరిణామం పెద్ద ఎదురుదెబ్బలాంటిదే. ఓ సంస్థను నడుపుతున్న అపర్ణ బీజేపీ కార్యక్రమాలను ప్రశంసిస్తూ.. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి రూ.11లక్షలు విరాళంగా ఇవ్వడం గమనార్హం. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో ఏడు విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడత ఎన్నికలు ఫిబ్రవరి 10న జరుగనుండగా.. మార్చి 7న చివరి దశ ఎన్నికల పోలింగ్‌ జరుగనున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles