Supreme Court raps Centre, Delhi over rising air pollution levels ఢిల్లీ వాయుకాలుష్యంపై కేంద్రం, ఆప్ స‌ర్కార్కు ‘సుప్రీం’ అల్టిమేటం.!

Giving you 24 hours supreme court s tough warning over delhi pollution

Delhi Air Pollution,Supreme Court On Delhi Air Pollution,Delhi Air Quality,Delhi Air Pollution News,Supreme Court Hearing,Delhi Air Pollution Updates,Delhi Air Pollution Latest Updates,Delhi Air Pollution News Updates,Supreme Court News

Delhi air pollution has increased despite the government claims, the Supreme Court said today, expressing dissatisfaction with the measures taken over the last few weeks. "We feel that nothing is happening and the pollution keeps increasing... only time is being wasted," Chief Justice NV Ramana said during the hearing - this is the fourth straight week that the court heard arguments over the air crisis in the national capital and nearby cities.

‘24 గంట‌లే..’ ఢిల్లీ వాయుకాలుష్యంపై కేంద్రం, ఆప్ స‌ర్కార్కు ‘సుప్రీం’ అల్టిమేటం.!

Posted: 12/02/2021 01:28 PM IST
Giving you 24 hours supreme court s tough warning over delhi pollution

ఢిల్లీలోని వాయు కాలుష్యం అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ మ‌రోసారి కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ రాష్ట్రప్రభుత్వంపై సీరియ‌స్ అయ్యింది. వాయు కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని ప్ర‌భుత్వాలు చెబుతున్నా.. కాలుష్యం మాత్రం త‌గ్గ‌డంలేద‌ని అత్యున్నత న్యాయస్థానం పేర్కోంది. రోజురోజుకూ కాలుష్యం పెరుగుతోందే కానీ నియంత్రణ చర్యలు ఫలితం కనబడటం లేదని.. అయితే ఈ క్రమంలో సమయం మాత్రం వృధా అవుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విచారణ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. గ‌త కొన్ని వారాల నుంచి ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల ప‌ట్ల సుప్రీం అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ప్ర‌భుత్వాలు ఏమీ చేయ‌డం లేద‌న్న ఆలోచ‌న వ‌స్తోంద‌ని విచార‌ణ స‌మ‌యంలో సీజే ఎన్వీ ర‌మ‌ణ అన్నారు.

రెండు ప్రభుత్వాలకు కేవలం 24 గంటల సమయం ఇస్తున్నామని ఈ లోగా కఠిన చర్యలు తీసుకుని వాయుకాలుస్యాన్ని నియంత్రించే చర్యలకు చేపట్టాని సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ప‌రిశ్ర‌మ‌లు, వాహ‌నాల ద్వారా వ‌చ్చే కాలుష్యంపై 24 గంట‌ల్లో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సుప్రీం త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. క‌ఠిన కాలుష్య నియంత్ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌ను వెల్ల‌డించాల‌ని కోర్టు డెడ్‌లైన్ పెట్టింది. స్కూళ్లు తెరిచిన అంశంపై సీజే ర‌మ‌ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మూడేళ్లు, నాలుగేళ్ల చిన్నారులు స్కూళ్ల‌కు వెళ్తున్నార‌ని, కానీ పెద్ద‌లు మాత్రం వ‌ర్క్‌ఫ్ర‌మ్‌హోమ్ చేస్తున్నార‌ని, ఇది స‌రిగా లేద‌ని కేజ్రీ ప్ర‌భుత్వంపై సీజే సీరియ‌స్ అయ్యారు. మీ ప్ర‌భుత్వ పాల‌న‌ను నియంత్రించేందుకు ఒక‌రిని నియ‌మిస్తామ‌ని కోర్టు చెప్పింది.

అయితే పాఠశాలల తెరిచినా.. విద్యార్థులకు అప్షనల్ గా అన్ లైన్ విద్యను కూడా అందిస్తున్నామని ఢిల్లీ ప్రభుత్వం తరుపున అభిషేక్ మను సింఘ్వీ న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన జస్టిస్ ఎన్వీ రమణ.. మీరు అప్షనల్ అంటున్నారు.. అయినా ఇంట్లో కూర్చోవాలని ఎవరికి ఉంటుంది.? కరోనా మహమ్మారి నేపథ్యంలో చిన్నారులు, పెద్దల అందరూ ఎదుర్కోంటున్న సమస్యలు మాకు తెలుసు. మాకు పిల్లలు, మనవళ్లు వున్నారు అని న్యాయమూర్తి జస్టిస్ రమణ అన్నారు. మీకు కేవలం 24 గంటల సమయాన్ని మాత్రమే ఇస్తున్నా. ఈలోగా వాయుకాలుష్యాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని అదేశించించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles