SpiceJet announces book-now-pay-later scheme స్పైస్ జెట్‌ బంపర్‌ ఆఫర్‌, ఇక వాయిదాల పద్దతిలో విమానయానం

Spicejet allows passengers to pay for tickets in instalments

SpiceJet, book-now-pay-later scheme, customers to pay tickets in instalments, SpiceJet, EMI offer, Bumper Offer, passengers, companies, business

SpiceJet on Monday launched a new scheme under which passengers will be able to pay for tickets in three, six or 12 instalments."As part of the launch offer, customers will be able to enjoy three months EMI option at no additional cost (no interest)," the airline said in a press release.

స్పైస్ జెట్‌ బంపర్‌ ఆఫర్‌, ఇక వాయిదాల పద్దతిలో విమానయానం

Posted: 11/08/2021 08:11 PM IST
Spicejet allows passengers to pay for tickets in instalments

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌ జెట్‌ ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఇప్పటికే బ్యాంకింగ్‌, రీటైల్‌, ఈ కామర్స్‌తో పాటు వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈఎంఐ సదుపాయాన్ని స్పైస్‌ జెట్‌ ఇప్పుడు విమాన ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. విమాన ప్రయాణికులు ఈఎంఐ సౌకర్యంతో స్పైస్ జెట్‌ ఫ్లైట్‌ టికెట్లను కొనుగోలు చేయొచ్చు. 3,6,12 నెలల పాటు వాయిదా పద్దతుల్లో వడ్డీ లేకుండా, కొనుగోలు చేసిన టికెట్ల ధర మొత్తాన్ని ఈఎంఐలో చెల్లించుకోవచ్చు.       

స్పైస్‌ జెట్‌ విమాన టికెట్లకు ఈఎంఐ సదుపాయం కావాలంటే ప్రయాణికులు తమ పాన్‌ నెంబర్‌, ఆధార్‌ కార్డ్‌, వీఐడీ వివరాల్ని నమోదు చేయాలి. వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ తో యాక్టీవ్‌ చేసుకోవాలి. వినియోగదారులు యూపీఐ ఐడీ ద్వారా ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ స్కీమ్‌ను పొందేందుకు ప్రయాణికులు ఎలాంటి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను అందించాల్సిన అవసరం లేదని స్పైస్‌ జెట్‌ పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles