PM Visits LK Advani On His 94th Birthday అద్వానీకి ప్రధాని, షా, ఉపరాష్ట్రపతి బర్తడే విషెస్

Pm narendra modi senior leaders greet lk advani on 94th birthday

PM Modi, LK Advani, LK Advani birthday, LK Advani Birthday Today, LK Advani Birthday News, LK Advani Birthday Latest News, PM Modi on LK Advani Birthday, PM Modi Wishes LK Advani on His Birthday, PM Narendra Modi, LK Advani News, LK Advani Latest New, National Politics

Prime Minister Narendra Modi today praised LK Advani for his "scholarly pursuits and rich intellect", and also credited the senior BJP leader for his efforts towards empowering people and enhancing "our cultural pride", as the former Deputy Prime Minister turned 94 today. The Prime Minister also drove to the veteran BJP leader's residence to personally greet him.

బీజేపి కురువృద్దనేత అద్వానీకి ప్రధాని, షా, ఉపరాష్ట్రపతి బర్తడే విషెస్

Posted: 11/08/2021 01:22 PM IST
Pm narendra modi senior leaders greet lk advani on 94th birthday

బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ రోజుతో ఆయన 94వ పడిలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం పాకిస్తాన్ లోని కరాచీలో 1927లో జన్మించిన ఎల్కే అద్వానీ భారత్- పాకిస్థాన్ దేశాల విభజన నేపథ్యంలో కరాచీ నుంచి కుటుంబంతో పాటుగా భారత్ కు తరలివచ్చిన విషయం తెలిసిందే. కాగా, దేశంలో బీజేపి పార్టీకి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ తో కలసి జీవం పోసిన ఘనత అద్వానీతదే. పార్టీని, మతాన్ని జోడించి.. హిందుత్వ పార్టీగా అవతరించేలా చేసిన ఘనత కూడా ఆయనదే.

రామజన్మభూమిలో రమ్యరామ మందిరం అన్న నినాదాన్ని తన భుజస్కందాలపై ఎత్తుకుని రెండు స్థానాలకే పరిమితమైన బీజేపిని పూర్తి మోజారిటీ సాధించి అధికారంలోకి వచ్చేలా చేయడం వెనుక ఆయన కృషి, పట్టుదల అనన్యమైనది. ఈ సందర్భంగా అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి వచ్చారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా వీరంతా ఒకే చోట కూర్చోని మాట్లాడుకున్నారు. మరోవైపు మోదీ ట్విట్టర్ ద్వారా కూడా అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 'గౌరవనీయులైన అద్వానీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్షుతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. దేశ ప్రజలను చైతన్యపరచడంలో, మన సంస్కృతిని విస్తరింపజేయడంలో ఆయన చేసిన కృషి చాలా గొప్పది. ఆయన మేధో సంపత్తి ఎంతో గర్వించదగినది' అని మోదీ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles