ఇంధన ధరల విషయంలో గత ఆరేళ్లుగా కేంద్రం ప్రకటనలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. గత ఎన్నికలకు ముందు ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే విషయమై కేంద్రం ఆలోచిస్తుందని చెప్పుకోచ్చిన కేంద్ర పెట్రోలియం శాఖామాత్యులు ధర్మేంద్ర ప్రధాన్.. ఆ తరువాత అందుకు రాష్ట్రాలు అంగీకరించడం లేదని చేతులెత్తేశారు. ఈ ఇటీవల జరగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు.. ఇకపై పెంచేది లేదని, ధరల పెంపుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పినా అవి నీటిమూటలేనని తేలిపోయాయి. ఇక ఇటు ఇంధన ధరలు మాత్రం గత డెబై ఏళ్లలో ఎప్పుడూ లేని గరిష్ట స్థాయికి చేరుకుని రికార్డును నమోదు చేస్తున్నాయి.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత (మే 4) రోజు నుంచి క్రమంగా ఇంథన దరలను పెంచూతూ వస్తోన్న కేంద్రం.. ఇప్పటి వరకు ఏకంగా 25 సార్లు ధరలను పెంచి దేశంలోని అనేక చోట్ల ధరలు వందకు పైగానే చేరుకునేలా చేసింది. దేశంలోని అనేక రాష్ట్రాలలో లాక్ డౌన్ అములో వున్నా తమ ధరలకు మాత్రం ఎక్కడా చెక్ పెట్టేది లేదని నిర్ణయించుకున్న ఇంధన కెంపెనీలు ఏకంగా మే నెలలో 16 సార్లు ఇంధన ధరలను పెంచూతూ నిర్ణయం తీసుకున్నాయి, మే నుంచి జూలై వరకు ధరలను విపరీతంగా పెంచిన కేంద్రం.. ఆగస్టు, సెప్టెంబర్లలో మాత్రం ఇంధన ధరలకు కళ్లం వేశాయి. సెప్టెంబర్ నెలాఖరు నుంచి ఇప్పటి వరకు మూడ వారాల వ్యవధిలో 16 పర్యాయాలు ఇంధన ధరలకు రెక్కలు వచ్చాయి.
ప్రభుత్వ చమురు కంపెనీలు ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు రెండూ పెరిగాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్ లీటర్కు 35 పైసలు, డీజిల్ లీటర్కు 37 పైసల వరకూ పెంచాయి. మే నెల నుంచి ఇప్పటివరకు చమురు ధరను మొత్తంగా 52 సార్లు పెంచిన సంస్థలతో.. దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలుపై 35 పైసలు పెరగడంతో రూ. 104.79కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 93.52కు పెరిగింది. ముంబైలో లీటరు పెట్రోలుపై 37 పైసలు పెరగడంతో రికార్డు స్థాయిలో రూ. 110 దాటేసి రూ. 110.75కు చేరుకుంది.
తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...
ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 105.39గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 94.22కు చేరింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర 110.75గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 102.15కు చేరింది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర 102.80గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 98.96కు చేరింది.
కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర 106.10గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 97.33కు చేరింది.
అమరావతి గుంటూరులో పెట్రోల్ ధర రూ, 111.86 కాగా, లీటరు డీజిల్ ధర రూ. 104.31కు చేరింది.
విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ ధర 110.93గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 103.42కు చేరింది.
హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 109.73గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 102.80కు చేరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more