Guinea confirms first death due to Marburg virus మర్బర్గ్ వైరస్ మహాడేంజర్.. సోకిన ఒక్కరోజులోనే వ్యక్తి మృతి

Guinea confirms west africa s first death due to marburg virus disease

what is Marburg virus disease, how is Marburg virus disease caused, Marburg virus disease causes symptoms, Marburg virus disease Guinea, Marburg virus disease west africa, world news, Marburg virus disease causes, Guinea, Marburg, marburg virus disease, WHO, World Health Organization, who, Sierra Leone, Marburg virus, Marburg, Fadela Chaib, west africa, WHO, guinea, Africa

The World Health Organization said that the Ministry of Health of Guinea, the West African country, has confirmed that one patient has died of the Marburg virus disease on August 2. “This is the first known case of Marburg virus disease in Guinea and in West Africa,” the world health body said in a statement.

మర్బర్గ్ వైరస్ మహాడేంజర్.. సోకిన ఒక్కరోజులోనే వ్యక్తి మృతి

Posted: 08/11/2021 12:28 PM IST
Guinea confirms west africa s first death due to marburg virus disease

ప్రపంచాన్ని అతలాకుళం చేస్తున్న కరోనా వైరస్ నుంచి మానవాళి ఇప్పటికీ అందోళనలో చిక్కకుని.. బయటపడేందుకు మార్గాలను అన్వేషిస్తూనే వుంది. ఈ క్రమంలో రూపాంతరం చెందుతున్న కరోనా వేరియంట్ల నుంచి ప్రజలు సురక్షితంగా బయటపడక ముందే ఆఫ్రికాలో బయటపడిన మరో ప్రాణాంతక వైరస్ కరోనా కన్నా మహాడేంజర్ అని స్పష్టం అవుతోంది. కరోనా వైరస్ కనీసం చికిత్సకు అవకాశామైనా కల్సిస్తుండగా, తాజాగా పశ్చిమాసియాలోని గినియా దేశంలో బయటపడిన మార్బర్గ్ వైరస్ సోకిన వ్యక్తి ఒక్క రోజు వ్యవధిలోనే మృత్యువాత పడటం భయాందోళనను రేకెత్తిస్తోంది.

ఎబోలా జాతికి చెందిన ఈ వైరస్ కరోనా తరహాలోనే అత్యంత వేగంగా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఈ వైరస్ సోకిన వారిలో 24 శాతం నుంచి 88 శాతం వరకు చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రారంభంలోనే ఈ వైరస్ కు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇది గబ్బిలాల్లో వ్యాపించే వైరస్ అని.. వాటి నుంచి మనుషులకు ఇది సోకి ఉంటుందని చెప్పింది. రోసెట్టస్ గబ్బిలాలు ఉండేఆవాసాలకు సమీపంలోకి వెళ్లే వారికి ఈ వైరస్ సోకుతుందని చెప్పింది. ఈ వైరస్ మనుషులకు సోకిన తర్వాత ఇతరులకు సులువుగా వ్యాపిస్తుందని తెలిపింది.

గినియాలోని గేక్కేడౌలో మార్‌బర్గ్ వైరస్ బారినపడి ఈ నెల 2న ఓ వ్యక్తి మరణించాడు. అతడు అంతకుముందు రోజే ఆ వైరస్ బారినపడ్డటం మరింత అందోళన కలిగించే అంశం. సదరు బాధితుడికి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మార్బర్గ్ వైరస్ బారిన పడినవారు ఏడు రోజులపాటు తీవ్ర ప్రభావానికి గురవుతారని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. దీనివల్ల రక్తనాళాలు కూడా చిట్లిపోతాయి. ఎబోలా జాతికి చెందిన మార్బర్గ్ వైరస్ కు ఇప్పటి వరకు ఎలాంటి చికిత్స లేదని, దీనికి కనీసం వాక్సీన్ కూడా కనుగోనలేదని డబ్యూహెచ్ఓ తెలిపింది.

గేక్కేడౌలో మార్‌బర్గ్ వైరస్ బారిన పడిన వ్యక్తికి వైరస్ సోకిన తరువాత అతనితో సన్నిహితంగా మెలిగిన 155 మందిని గెనియా ప్రభుత్వం ఐసోలేట్ చేసి వారి అరోగ్యాన్ని పరిశీలిస్తోందని డబ్యూహెచ్ఓ తెలిపింది. వైరస్ బారిన పడిన వారు ఉపయోగించిన వస్తువుల ద్వారా ఇది ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందని చెప్పింది. మార్బర్గ్ వైరస్ సోకగానే తీవ్ర జ్వరం, విపరీతమైన తలనొప్పి, చికాకు కలుగుతాయి. ఈ వైరస్ కు వ్యాక్సిన్, చికిత్స లేదు. అయితే, ఆయా లక్షణాలకు ప్రత్యేకంగా చికిత్సను అందించడం ద్వారా బాధితుడి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా, కాంగో, కెన్యా, ఉగాండా, అంగోలా దేశాల్లో కూడా ఈ వైరస్ కేసులు అత్యల్పంగా నమోదయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : World Health Organization  who  Sierra Leone  Marburg virus  Marburg  Fadela Chaib  west africa  WHO  guinea  Africa  

Other Articles