AIIMS Chief Says COVID Third Wave Could Hit India in 6 to 8 Weeks అక్టోబర్ లో కరోనా మూడో దశ ముప్పు: ఏయిమ్స్ చీఫ్

Aiims chief randeep guleria says covid third wave inevitable could hit india in 6 to 8 weeks

Third Wave,Third Wave of corona,Third Wave of covid,Third Wave in india,india Third Wave,covid Third Wave,corona Third Wave,aiims chief,randeep gularia,delta plus variant,delta variant, Covid-19, journal Science Immunology, Children, Clinical Trails, Covaxin Clinical Trials, Children volenteers, New Delhi

AIIMS director Dr Randeep Guleria has stated that the third wave is “inevitable” and it could hit the country in the next six to eight weeks. Dr Guleria said, “Third wave is inevitable and it could hit the country within the next six to eight weeks… maybe a little longer”. “It all depends on how we go ahead in terms of Covid-appropriate behaviour and preventing crowds,” he added.

అక్టోబర్ లో కరోనా మూడో దశ ముప్పు: ఏయిమ్స్ చీఫ్ రణ్ దీప్ గులేరియా

Posted: 06/19/2021 03:46 PM IST
Aiims chief randeep guleria says covid third wave inevitable could hit india in 6 to 8 weeks

కొవిడ్ థర్డ్ వేవ్ ప్రమాదం మరో 6 నుంచి 8 వారాల్లో పొంచి ఉందని ఎయిమ్స్ చీఫ్ డా. రణదీప్ గులేరియా అంటున్నారు. ప్రముఖ ఇంగ్లీష్ మీడియా ఎన్డీటీవీతో మాట్లాడిన ఆయన.. వారాల తరబడి విధించిన ప్రక్రియను అన్ లాక్ చేయడంతో రాబోయే సమస్యలను ప్రస్తావించారు. దేశానికి ఉన్న పెద్ద ఛాలెంజ్ జనాభాకు తగ్గట్లుగా వ్యాక్సిన్ డోస్ గ్యాప్ లేకుండా చూసుకోవడమే. మరింత మందికి వ్యాక్సినేషన్ సకాలంలో వేయగలగాలి. కొత్త మ్యూటెంట్ వైరస్.. డెల్టా ప్లస్ వేరియంట్ గురించి కూడా మాట్లాడారు.

‘అన్ లాకింగ్ స్టార్టింగ్ చేసినప్పటి నుంచి కొవిడ్ తీవ్రత మళ్లీ పెరుగుతుంది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ నుంచి తెలుసుకున్నదేదీ అమలుపరచకుండా గుంపులుగా తిరిగితే ప్రమాదం తప్పదు. జాతీయ స్థాయిలో కేసులు పెరగడానికి కాస్త సమయం పడుతుంది. దాదాపు ఇది దేశమంతా ప్రభావం చూపించడానికి 6 నుంచి 8వారాల వరకూ పట్టొచ్చు’ అని డా. గులేరియా అన్నారు. ఇదంతా మనం అన్ లాక్ తర్వాత చూపించే ప్రవర్తనను బట్టి ఉంటుంది. ఇప్పటికీ దేశంలో 5శాతం జనాభా వ్యాక్సినేషన్ చేయించుకున్నారు.

మొత్తం దేశంలో ఉన్న 130 కోట్ల జనాభాలో 108కోట్ల మందికి ఏడాది చివరికల్లా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలనుకుంటుంది ప్రభుత్వం. వ్యాక్సినేషన్ అనేదే మెయిన్ ఛాలెంజ్. కొత్త వేవ్ విజృంభించడానికి మూడు నెలలు పట్టొచ్చు.. ఇంకా తక్కువ వ్యవధిలోనూ జరగొచ్చు. పలు అంశాలపై ఆధారపడి జరుగుతుంది. నిబంధనలు తప్పకుండా అనుసరించడం, కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండటం వల్ల వ్యాప్తిని తగ్గించవచ్చు. చివరి సారి కొత్త వేరియంట్ బయట నుంచి వచ్చి ఇక్కడ డెవలప్ అయింది. కొత్త మ్యూటెంట్లగా మారి ప్రమాదకరంగా మారింది’ అని ఎయిమ్స్ చీఫ్ అభిప్రాయపడ్డారు.

ఇండియాలో తొలి వేవ్ వచ్చినప్పుడు వైరస్ అంతవేగంగా వ్యాపించలేదు. సెకండ్ వేవ్ మాత్రం చాలా ప్రమాదవంతంగా మారింది. ఇప్పుడు రాబోయే డెల్టా వేరియంట్ అంతకుమించి వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. మళ్లీ కేసులు పెరగడం, హాస్పిటల్స్ లో బెడ్ల కొరత వంటి సమస్యలు అలానే ఉంటే చాలా నష్టం చూడాల్సి వస్తుంది. మనం చేయాల్సిందల్లా ఫ్రెష్ కేసులు నమోదుకాకుండా చూసుకోగలగడమే’ అని డా. గులేరియా స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Third Wave  Coronavirus  Children  India  aiims chief  randeep gularia  delta plus variant  delta variant  

Other Articles