US man kills 6 people at Colorado birthday party అమెరికాలో మరోమారు పెలిన తూటా.. 11 మంది మృతి

Boyfriend attacks birthday party kills six and himself in colorado say police

Gun Culture, US Gun Culture, gun shot, Colorado gun firing, colorado birthday party, boy friend fires New York City, Dermot Shea, Times Square, Anderson, America, United States, Crime

A man fatally shot six people including his girlfriend before turning the gun on himself early on Sunday at a birthday party in Colorado Springs, Colorado, but did not fire on traumatized children who were present inside a trailer at a mobile home park. And in another incident three people including a four-year-old girl were shot in New York City's Times Square.

అమెరికాలో మరోమారు పెలిన తూటా.. 11 మంది మృతి

Posted: 05/10/2021 01:27 PM IST
Boyfriend attacks birthday party kills six and himself in colorado say police

అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతి నానాటికీ పేట్రేగిపోతున్నది. గన్ కల్చర్ తో అభంశుభం తెలియని అమాయక విద్యార్థులు ఉపాధ్యాయులను, సహచర విద్యార్థులపై తూటాలతో దాడి చేసి వారి ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ఓర్పు, సహనం, అన్న పదాలకు అర్థం తెలుసుకుని మసులుకోవడం తెలియని విద్యార్థులు క్షణికావేశంలో తోటివారి ప్రాణాలను తీసేస్తున్నారు. చిన్నారుల నుంచి మొదలుకుని పెద్దల వరకు అందరూ క్షణికావేశంలో ఆయుధాలను తీసుకువచ్చి కాల్పులు జరపడమే పరిష్కారంగా ఎంచుకుంటున్నారు. అగ్రరాజ్యంలో తుపాకీ సంస్కృతిని నియంత్రించాలని పాలకులు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ అచరణ సాధ్యంకాలేదు.

ఇటీవల అగ్రరాజ్యంలోని మరోమారు నగరంలోని ఓ తరగతి గదిలో కాల్పుల మోత మ్రోగింది. ఆరో త‌ర‌గ‌తి విద్యార్థిని తాను చ‌దువుతోన్న‌ పాఠ‌శాల‌లో తుపాకీతో కాల్పులు జ‌రిపి అల‌జ‌డి రేపింది. ఇదాహో రాష్ట్రంలోని రిగ్బి అనే చిన్ననగరంలోని రిగ్బి మిడిల్ స్కూల్ లో ఆరో తరగతి చదువుతున్న ఓ బాలిక‌ బడికి వ‌చ్చే స‌మ‌యంలోనే ఓ తుపాకీని త‌న వెంట తెచ్చుకుంది. పాఠ‌శాల‌లో విచక్షణ రహితంగా కాల్పులకు తెగ‌బ‌డ‌డంతో ఇద్దరు విద్యార్థులు, స్కూల్ సిబ్బందికి ఒకరికి గాయాల‌య్యాయి. ఈ ఘటన జరిగి సరిగ్గా మూడు రోజులు కూడా కాకముందే మరోమారు తుపాకీ తూటాలు గర్జించాయి. రెండు వేర్వేరు ఘటన్లలో ఏకంగా 11 మంది తుపాకీ తూటాలకు బలయ్యారు.

అమెరికాలోని కొలరాడోలోని జన్మదిన వేడుకల్లో నిమగ్నమైన కుటుంబంపై ఓ నిందితుడు విఛక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఆనందంలో మునిగి తేలుతున్న ఆ కుటుంబాన్ని క్షణాల్లో విషాదం వెంటాడింది. మొబైల్ హోం పార్క్ లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటూ సంతోషంలో తెలియాడుతున్న కుటుంబాన్ని నిందితుడు విచ్చిన్నం చేశాడు. నిందితుడు జరిపిన కాల్పుల్లో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఈ వేడుకలో పాల్గొన్న చిన్నారులకు ఎలాంటి గాయాలు కాలేదని, వారు తమ బంధువుల వద్ద సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. పార్టీ చేసుకుంటున్న కుటుంబంలోని మహిళకు నిందితుడు బాయ్ ఫ్రెండేనని పోలీసులు నిర్ధారించారు. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు.

బాధితులు, నిందితుడి పేర్లను పోలీసులు వెల్లడించలేదు. మరో ఘటనలో ఉడ్ ల్యాండ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. నిందితుడు తన పొరుగు ఇంటిలోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం నిందితుడు ఆ ఇంటికి నిప్పు పెట్టాడు.  ఎదురు కాల్పుల్లో అతడు హతమైనట్టు పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gun Culture  US Gun Culture  gun shot  Colorado gun firing  colorado birthday party  boy friend  

Other Articles