Anand Mahindra gives Idli Amma new home-workspace ఇడ్లీ బామ్మకు ఇల్లు కట్టించిన పారిశ్రామిక వేత్త

Anand mahindra fulfills promise tn s famous idli amma gets new home workspace

anand mahindra, idli amma, tn woman sell idli at re 1, re 1 idli vendor to get new home, mahindra rise new home idli vendor, anand mahindra invest local vendor, idli at re 1, new home, Kamalathal, Coimbatore, Tamil Nadu, viral news

Kamalathal from Coimbatore went viral as 'Idli Amma' in 2019 for cooking and selling idlis for just Re 1. After Mahindra's tweet helped her get a gas connection then, now, the company is going to build her a home.

ఇడ్లీ బామ్మకు ఇల్లు కట్టించిన పారిశ్రామిక వేత్త

Posted: 04/03/2021 06:28 PM IST
Anand mahindra fulfills promise tn s famous idli amma gets new home workspace

ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు అమ్మారు. ఇంతకీ ఎంత అనుకుంటున్నారు. అమె వద్ద మూడు ఇడ్లీలు మూడు రూపాయలే. అంటే కేవలం రూపాయికే ఇడ్లీ అన్నమాట. ఇది కూడా తన ఇడ్లీ చేయడానికి అవసరమైన సరుకులు తెచ్చుకునేందుకు మాత్రమే తీసుకుంటోంది. అంత పెద్ద వయస్సులోని అమె ఇలా తనకు నచ్చిన విధంగా ప్రజా సేవ చేస్తుండటం మీడియాకు తెలిసింది.

పేదల ఆకలి తీరుస్తున్న ‘ఇడ్లీ బామ్మ’ కమలాత్తాళ్‌ గుర్తుంచి పేపర్లు, చానళ్లు చూపించాయి. అంతే అమె ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. ఆమె గురించి తెలుసుకున్న పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా అమె కథనంపై స్పందిస్తూ.. త్వరలోనే ఆమెకు సొంత ఇల్లు రాబోతోందిని స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. అదెలా.. ఇంతకీ అమెకు ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిన అవసరమేంటి.. అన్న ప్రశ్నలకు ఉత్పన్నమవుతాయి. ఆ వయస్సులోనూ అమె చేస్తున్న సేవకు ఆయన మనస్సు కరిగిపోయింది. అమెకు చేతనైనంత సాయం చేసి.. అండగా నిలవాలని భావించారు.

తమిళనాడులోని పేరూరు సమీపంలో గల వడివెలంపాలయం గ్రామానికి చెందిన కమలాత్తాళ్‌ గత 37ఏళ్లుగా రూపాయికే నాలుగు ఇడ్లీలు అమ్ముతూ పేదల ఆకలి తీరుస్తున్నారు. రోజుకు వెయ్యి ఇడ్లీల వరకు అమ్ముతూ నిరుపేద జీవితాలకు తనవంతు సాయం చేస్తున్నారు. ఈ ఇడ్లీ బామ్మ గురించి 2019లో ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేయడంతో అప్పట్లో ఆ కథనం వైరల్‌గా మారింది. ఆమెకు సాయం చేయడానికి ముందుకొచ్చిన మహీంద్రా.. కమలాత్తాళ్‌కు వంటగ్యాస్ కు అయ్యే ఖర్చును భరిస్తున్నారు. అంతేకాదండోయ్‌.. ఆమె వ్యాపారంలో పెట్టుబడి పెడతానని కూడా చెప్పారు.

తాజాగా మహీంద్రా మరోసారి ఆ బామ్మ వీడియో తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. కమలాత్తాళ్‌కు త్వరలోనే కొత్త ఇంటిని నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. ‘‘ఒకరి స్ఫూర్తిమంతమైన జీవితంలో చిన్న భాగమయ్యే అరుదైన అవకాశం చాలా కొద్దిమందికి మాత్రమే లభిస్తుంది. నాకు ఆ అవకాశాన్ని కల్పించిన ఇడ్లీ అమ్మ కమలాత్తాళ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. త్వరలోనే ఆమెకు సొంత ఇల్లుతో పాటు పనిప్రదేశం కూడా రాబోతోంది’’ అని మహీంద్రా ట్వీట్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anand mahindra  idli amma  idli at re 1  new home  Kamalathal  Coimbatore  Tamil Nadu  

Other Articles

Today on Telugu Wishesh