Passengers not wearing mask to be fined at airports మాస్క్ ధరించని ప్రయాణికులపై జరిమానా, కఠిన చర్యలు

Govt warns of fines police action against flyers violating covid norms at airports

airport covid-19 rules, airports coronavirus rules, airport covid guidelines, airport covid test, covid test airport, social distance, India, Covid-19 norms, passengers, masks, COVID-19 count, COVID deaths, COVID19 updates, Coronavirus death toll, Coronavirus news, Coronavirus treatment, Coronavirus symptoms, COVID-19 symptoms, covid airport news

Aviation regulator DGCA has found the compliance of Covid-19 protocols at the country’s airports to be “not satisfactory”, and consequently asked all airport operators to step up surveillance while exploring the possibility of imposing spot fines to those violating rules such as improper wearing of masks and social distancing.

మాస్క్ ధరించని ప్రయాణికులపై జరిమానా, కఠిన చర్యలు: డిజీసిఐ

Posted: 03/31/2021 05:12 PM IST
Govt warns of fines police action against flyers violating covid norms at airports

కరోనా వైరస్ మహమ్మారి రెండో దఫా విరుచుకుపడుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా మళ్లీ కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలను అమల్లోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా అందరూ మాస్కులు ధరించాలని, ప్రతీ గంటకు చేతులు కడుక్కోవాలని, బయట తిరిగే వ్యక్తులు తప్పనిసరిగా చేతులను శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్న కేంద్ర కుటుంబఆరోగ్యశాఖ.. టీకా వేయించుకున్నవారైనా సరే తప్పనిసరిగా ఈ జాగ్రత్తలను పాటించాలని సూచించింది. ఈ క్రమంలో మాస్క్ ధరించకుండా రోడ్లపై బాహాటంగా సంచరిస్తున్నవారిపై జరిమానాను విధించింది.

ఇక ఈ క్రమంలో విమానాశ్రయాల్లో ఎవరైనా మాస్క్ ధరించకుండా సంచరిస్తే వారిపై కఠిన చర్యలకు పూనకునేలా అదేశాలను జారీ చేసింది. ఈ మేరకు పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ విమానాశ్రయ అధికారులకు అదేశాలను జారీ చేసింది. కరోనా నిబంధనలు పాటించని ప్రయాణికులను విమానాల నుంచి దించేయాలని ఇప్పటికే విమానయాన సంస్థలను ఆదేశించిన డీజీసీఏ.. తాజాగా ఎయిర్ పోర్టులకు సూచనలు చేసింది. విమానాశ్రయాల్లో మాస్క్ లు లేకుండా కన్పించేవారిపై తక్షణ జరిమానాలు విధించాలని సూచించింది. ఈ మేరకు సర్క్యులర్‌ జారీ చేసింది.

దేశంలోని పలు విమానాశ్రయాల్లో కొవిడ్‌ నిబంధనల అమలు సంతృప్తికరంగా లేదని ఇటీవల జరిపిన పరిశీలనలో తేలిన విషయం తెలిసిందే. విమానాశ్రయ ప్రాంగణంలో ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా విమానాశ్రయ నిర్వాహకులు చూసుకోవాలని అదేశాలను డిజీసిఐ జారీ చేసింది. ముక్కు, నోటిని కవర్‌ చేసేలా మాస్క్ లు ధరించడం, సామాజిక దూరం వంటి నియమాలను పాటించేలా చూడాలని పేర్కోంది. ఈ అంశాలపై అన్ని విమానాశ్రయాలు మరింత నిఘా పెంచాలని కోరుతున్నామని డీజీసిఐ తమ సర్కులర్ లో పోందుపర్చింది.

నిబంధనల ఉల్లంఘించేవారిపై అవసరమైతే శిక్షార్హమైన చర్యలు కూడా తీసుకునే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. స్థానిక పోలీసు అధికారుల సహకారంతో నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం తక్షణ జరిమానాలు విధించాలని డీజీసీఏ విమానాశ్రయ నిర్వాహకులను సూచించింది. విమానాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించని ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పదేపదే హెచ్చరించినా మాస్క్ లు పెట్టుకోకపోతే విమానం నుంచి దించేయాలని ఈ నెల 13న డీజీసీఏ విమాన సంస్థలను ఆదేశించిన విషయం తెలిసిందే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles