Chaddi gang convicted for Seven Years Jail చెడ్డీగ్యాంగ్ దొంగలకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష

Six members of chaddi gang sentenced to 7 years jail term

chaddi gang, Nizamabad court, dacoities, Nizamabad Asst sessions court, local court, maharashtra dacoities, Seven Years Imprisonment, rigorous imprisonment, Nizamabad, Rachakonda Police, Telangana, Crime

Six members of the ‘Chaddi gang’ from Maharashtra were sentenced to Seven years of rigorous imprisonment by Nizamabad Assistant sessions Court on Thursday.

‘చెడ్డీ గ్యాంగ్’ ముఠాకు ఏఢేళ్ల జైలు శిక్ష విధించిన నిజిమాబాద్ కోర్టు

Posted: 03/11/2021 03:48 PM IST
Six members of chaddi gang sentenced to 7 years jail term

తెలంగాణలోని పలు జిల్లాల్లో పలు దొంగతనాలకు పాల్పడిన చెడ్డీ గ్యాంగ్ దొంగలకు నిజామాబాద్ జిల్లాలోని న్యాయస్థానం ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. జిల్లాలో మారణాయుధాలు చేతబట్టి పలు చోట్ల దొంగతనాలకు పాల్పడి.. దొంగలు ఆ తరువాత పోలీసులకు చిక్కారు. దీంతో వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిచిన న్యాయస్థానంలో ప్రవేశపెట్టడంతో ఈ కేసును విచారించిన న్యాయస్థానం వారిని దోషులగా తేల్చింది. ఇక ఈ కేసులో తీర్పును వెలువరించిన న్యాయస్థానం దోషులకు ఏడేళ్ల కఠిన కారాగారశిక్షను విధిస్తూ తీర్పునచ్చింది. ఇక ఈ కేసులోని దోషులందరూ మహారాష్ట్రకు చెందిన వారే కావడం గమనార్హం.

ఈ మేరకు నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు తీర్పును వెలువరించింది. దీంతో ఇప్పటికే దొంగతనం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దొంగలకు ఆ శిక్షతో పాటు ఈ శిక్షను కూడా అమలు చేయబడుతోంది. కేసు వివరాల్లోకి వెళ్తే.. 4 నవంబరు 2019లో నిజామాబాదులోని లలితానగర్ లో నివాసముంటున్న పెద్ద తిమ్మయ్య ఇంట్లో చెడ్డీగ్యాంగ్ ముఠా మారణాయుధాలతో ప్రవేశించి 15 తులాల బంగారం అపహరించింది. దొంగతనం గురించి మరుసటి రోజున తెలుసుకన్న బాధితులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సిసిటీవీ కెమెరాలతో పాటు క్లూస్ టీ కూడా రంగంలోకి దిగి వేలిముద్రలను, తదితర సాక్ష్యాలను సేకరించింది.

ఇక ఏ జిల్లాలోనే ఎక్కువ రోజులు వుండని చోరులు.. జిల్లాలను మార్చుతూ దోంగతనాలకు పాల్పడుతుండేవారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ సాగించినా ఫలితం లేకపోయింది. అయితే, అదే ఏడాది డిసెంబరు 29న ఓ చోరికి పాల్పడేందుకు వెళ్లిన చెడ్డీ గ్యాంగ్ ముఠాను రాచకొండ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో వారు నిజామాబాద్లోనూ దొంగతనం చేసినట్టు అంగీకరించారు. దీంతో ఈ కేసులో వాదనలు విన్న సెషన్స్ కోర్టు జడ్జి కిరణ్మయి.. ముఠాలోని ఆరుగురు సభ్యులకు ఏడేళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. మరో నిందితుడు ఎండీ సాజిద్‌పై నేరం నిరూపణ కాకపోవడంతో అతడిపై నమోదైన కేసును కొట్టివేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles