కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సుమారు మూడు నెలలుగా నిరసనోద్యమన్ని చేపడుతున్న రైతులు ఇవాళ దేశవ్యాప్తంగా రైల్ రోకో కార్యక్రమాన్ని చేపట్టారు. దేశ రాజధాని సరిహద్దులోని సింఘు, ఘాజీపూర్, టిక్రీ ప్రాంతాలలో పెద్దస్థాయిలో మోహరించి నిరసన తెలుపుతున్న రైతుల పిలుపుమేరకు దేశవ్యాప్తంగా రైతు సంఘాల నేతలు కదిలి రైళ్లను ఏకంగా నాలుగు గంటల పాటు ఎక్కడా కదలకుండా రైల్ రోకో కార్యక్రమాన్ని చేపట్టారు, ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రైల్ రోకో కార్యక్రమం నిర్విఘ్నంగా కోనసాగింది.
మరీముఖ్యంగా ఉత్తర భారతంలోని హర్యానా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్తో పాటు ఇటు మహారాష్ట్ర, కర్నాటక, జమ్మూకాశ్మీర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ రైతులు, రైతుల పిలుపుమేరకు పలు రాజకీయ పార్టీలు రైల్ రోకోకు పిలుపునిచ్చాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉత్తర భారత్‌లో పలు రైళ్లు రద్దుకాగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. హర్యానా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రైళ్లు ముందుకు కదలకుండా రైతులు రైల్వే ట్రాక్ లపై ఆందోళనకు దిగారు.
జమ్మూకశ్మీర్ లోని పలు ప్రాంతాల్లోనూ సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు రైల్ రోకోలో పాల్గొని ఆందోళనలు చేస్తున్నారు. శాంతి భద్రతల అంశాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రైల్వే శాఖ అప్రమత్తమై పలు చర్యలు తీసుకుంటోంది. ఆందోళనలు శాంతియుతంగా జరపాలని ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ చెప్పారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిఘా వర్గాల సాయం తీసుకుంటామన్నారు.
ముఖ్యంగా పంజాబ్ తో పాటు హర్యానా, యూపీ, పశ్చిమబెంగాల్ సహా ఇతర కొన్ని ప్రాంతాలపై దృష్టి పెట్టామని చెప్పారు. హర్యానాలో, సోనిపట్, అంబాలా మరియు జింద్ వద్ద రైలు స్టేషన్లు పూర్తిగా మూసివేయబడ్డాయి . రైల్వే అంబాలా, కురుక్షేత్ర, పానిపట్, పంచకుల మరియు ఫతేహాబాద్ (భట్టు కలాన్) జిల్లాల్లో నిరసనకారులు ఆందోళన కొనసాగిస్తున్నారు. వారిలో చాలామంది మహిళలు ఉన్నారు. పంజాబ్‌లో ఢిల్లీ-లుధియానా-అమృత్ సర్ రైల్వే మార్గంలో పలు చోట్ల నిరసనకారులు ట్రాక్‌లపై కూర్చున్నారని అధికారులు తెలిపారు. జలంధర్ మరియు మొహాలి జిల్లాలలోని జలంధర్ కాంట్-జమ్మూ రైల్వే ట్రాక్‌ను రైతులు అడ్డుకున్నారు.
తెలంగాణలోనూ రైల్ రోకో ఆందోళన నిర్వహిస్తున్నారు. సాగు చట్టాలను నిరసిస్తూ కాచిగూడ రైల్వే స్టేషన్లో రైల్ రోకో చేపట్టారు. అక్కడ నిర్వహించిన రైల్ రోకోలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో పాటు వామపక్ష నేతలు పాల్గొన్నారు. అటు ఆంధ్ర్రప్రదేశ్ లోనూ రైతు సంఘాల నేతలు పలు ప్రాంతాల్లో రైల్ రోకో పిలుపులో భాగంగా రైల్వే ట్రాకులపై కూర్చుని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇక కర్నాటకలోనూ రైతులు రైల్ రోకో నిర్వహించారు, రైతులను నిరసనను పోలీసులు అడ్డుకోవడంతో బెంగళూరులో గందరగోళం నెలకొంది. "రైల్ రోకోను నిర్వహించడానికి పోలీసులు మాకు అనుమతి ఇవ్వడం లేదని వారు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .
ఇక ఈ సందర్భంగా భారతీయ కిసాన్ మోర్చా రైతు సంఘం నాయకుడు రాకేష్ తికాయత్ ఇప్పటికైనా కేంద్రప్రభుత్వ తమకు వ్యతిరేకమైన నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ ఏడాది మే నెలలో జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో రైతులు తమ ట్రాక్టర్లు నడుపుకుంటూ పశ్చిమ బెంగాల్ చేరుకుంటారని.. అక్కడి బీజేపి రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అందోళనలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. దీంతో బీజేపి అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న పశ్చిమ బెంగాల్ లో రైతులు తమ ప్రభావాన్ని చూపుతారని తేల్చిచెప్పారు.
(And get your daily news straight to your inbox)
Mar 06 | టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఎన్నికల ప్రచారం ఎప్పుడు చేపట్టినా ఆయన తన చేతివాటాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారుతోందన్న విమర్శలకు మరోమారు... Read more
Mar 06 | ఉత్తమ సర్పంచ్‌గా అవార్డు తీసుకున్న వ్యక్తి రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఏసీబీ కథనం ప్రకారం.. జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ... Read more
Mar 06 | సొంత పార్టీ తీసుకునే నిర్ణయాలను కూడా విమర్శించే బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరలపై తనదైన శైలిలో విసిరిన పంచ్ బీజేపి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఒక విధంగా వరుసగా ఆరు రోజుల... Read more
Mar 06 | ఝార్ఖండ్‌లో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిని బంధించిన 60 మంది దుండగులు నెలరోజులగా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. మాదకద్రవ్యాలను ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ తనపై నిత్యం అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.... Read more
Mar 06 | యావత్ ప్రపంచ దేశాల అర్థిక పరిస్థితులను కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసిన నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు గత ఏడాది జూన్ లో ఏర్పడిన అన్ లాక్ నుంచి ప్రతీ అంశంలో ధరాఘాతాన్ని ప్రజలు... Read more