cricketer dies on pitch while he is playing హృదయవిదారకం: పీచ్ పైనే ప్రాణాలు విడిచిన క్రికెటర్

Cricketer dies on pitch while he is playing video goes viral

cricketer dies on ground, cricketer dies on pitch, cricketer, pune, pitch, death, healthy, sports, cricket

A young cricketer in pune falls to death on ground during the match as he had a sudden heart stroke.

ITEMVIDEOS: హృదయవిదారకం: పీచ్ పైనే ప్రాణాలు విడిచిన క్రికెటర్

Posted: 02/17/2021 08:32 PM IST
Cricketer dies on pitch while he is playing video goes viral

ఎంతటి అరోగ్యవంతులైనా.. మృతువు కబళించి వేస్తోంది. ప్రాణమున్న ఏ జీవికైనా ఆత్మ పరమాత్మలో ఐక్యం కావాల్సిందే. అయితే అనారోగ్యం బారినపడే వారు మధ్య వయస్సులోనే మరణాలకు గురువుతారని తెలుసు. కానీ ఆరోగ్యంగా ఫిట్ గా వుంటూ క్రీడల్లో రాణించే వ్యక్తులను కూడా మరణం ఆకస్మాత్తుగా పలుకరిస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని పూణేలో ఓ క్రికెటర్‌ క్రీజులో ఉండగానే కుప్పకూలిపోయాడు. ఇది చూసిన అంపైర్ మ్యాచ్ ను నిలిపి..  స్ట్రేచ్చర్ కోసం కబరుపెట్టగా సహచర ఆటగాళ్లు వచచి చూసే సరికి ఆయన ప్రాణాలతో లేదు.

క్షణాల ముందు తన తోటి ఆటగాడికి ఆటలో ఏదో సూచించిన క్రికెటర్.. మరుక్షణాల్లోనే కుప్పకూలిపోయాడు. బౌలర్ బంతిని వేసేందుకు వెళ్తున్న సమయంలో తన రన్నర్ సైడ్ క్రీజ్ లో మెల్లిగా కూర్చునే ప్రయత్నం చేశాడు. తొలుత వంగినా.. ఆ తరువాత కూర్చున్నాడు.. అంతే రెప్పపాటులో వెనక్కు పడిపోయి ప్రాణాలను వదిలాడు. తోటి ఆటగాళ్లు వచ్చి చూడగానే మృతిచెందాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. క్రికెట్ హఠాన్మరణం పోందడం పట్ల క్రీడాకారుల, క్రీడాభిమానుల సమాజాం విషాదంలో మునిగింది.

ఇక ఈ ఘటనను కళ్లెదురుగా చూసిన సహచర ఆటగాళ్ల నోట మాట రాలేదు. వారంతా విషాదంలో మునిగారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పుణేలోని జున్నార్ మండలంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. బ్యాట్స్‌మన్‌ బంతిని కొట్టగా పరిగెత్తేందుకు ప్రయత్నించగా ఫీల్డర్‌ చేతిలోకి బంతి రావడంతో వెనుతిరిగారు. అయితే నాన్-స్ట్రైక్ వైపు నిలబడి ఉన్న బ్యాట్స్‌మెన్ బాబు నల్వాడే వెనక్కి తిరిగొచ్చేసి నిలబడ్డాడు. ఈ సమయంలో కొద్దిసేపటి తర్వాత బాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీన్ని చూసిన ఎంపైర్‌ ఆటగాళ్లను పిలిచారు.

వారు వచ్చి చూసేసరికి నల్వాడే ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో హృదయాలను పిండేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బ్యాట్ పట్టుకుని మోకాళ్లపై కూర్చుని ఉండి ఆ కొద్దిసేపటికి కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. ఏమైందో అర్థంకాక అందరూ కంగారుపడ్డారు. వెంటనే అతడిని దగ్గర్లోని వైద్యుడి వద్దకు తీసుకువెళ్లగా అప్పటికే అతను మరణించినట్లు ధృవీకరించారు. అయితే గుండెపోటు కారణంగానే అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricketer  pune  pitch  death  healthy  sports  cricket  

Other Articles

Today on Telugu Wishesh