పర్యావరణ సమతుల్యం కారణంగా సంభవించిన ప్రకృతి ప్రకోపంతో ఉత్తరాఖండ్ లో జలవిలయం సంభవించి 170 మంది గల్లంతయ్యై, ఇరవై మంది వరకు మరణించిన ఘటన దేశ ప్రజలకు తీవ్ర అందోళనకు గురి చేసింది. 2014లో సంభవించిన ఉత్తరాఖండ్ హిమాలయ సునామీని గుర్తుకు తెచ్చింది. ఈ దుర్ఘటనలో జలవిద్యుత్ కేంద్రాలు, వంతెనలు, నామరూపాల్లేకుండా కొట్టకుపోయాయి. ఉత్తరాఖండ్ చమోలీ జిల్లా జోషిమర్ సమీపంలో నందాదేవి-హిమానీనదంలోని పెద్ద మంచు చరియలు విరిగి దోలిగంగా నదిలో పడిటంతో అకస్మాత్తుగా దొలిగంగ, రుషిగంగా, అలకనంద నదులు మధ్య వరదలు సంభవించాయి.
దీంతో తపోవన్ రేణి వద్ద ఎన్టీపీసీ ఆధ్వర్యంలో తపోవన్- విష్ణుగడ్ ల మధ్య 480 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రంలోకి నీరు ప్రవహించింది. ఇక్కడ పనిచేస్తున్న 170 మంది కార్మికులు గల్లంతయ్యారు. వీరిలో 16 మందిని క్రితం రోజున ఐటీబీపీ-ఎన్డీఆర్ఎఫ్ దళాలు రక్షించాయి. కాగా దౌలిగంగా నదిలో మళ్లీ నీటి ఉద్దృతి పెరగడంతో పాటు చీకటి పడిన కారణంగా సహాయక చర్యలు ముగించిన అధికారులు.. ఇవాళ తెల్లవారు జామునుంచే మళ్లీ సహాయక చర్యలను ప్రారంభించారు. కార్మికుల కోసం డెహ్రడూల్ నుంచి ఒకటి, ఢి్లీ నుంచి నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ఇక ఘజియాబాద్ నుంచి మరో ఆరు బృందాలు చేరుకుగా, 600 మంది సైనికులు కూడా సహాయచర్యల్లో పాల్గోన్నారు.
సోరంగంలో మరో 30 మంది కార్మికులు చిక్కకున్నారని, తమకు సమాచారం అందిందని ఐటీబీపి అధికార ప్రతినిధి తెలిపారు. వీరిందరినీ కాపాడేందుకు దాదాపు 300 మంది ఐటీబీపి జవాన్లు శ్రమిస్తున్నారని తెలిపారు. అయితే సొరంగంలో వున్నవారిని నిన్న సాయంత్రమే కాపాడామని, అయితే మరో టన్నెల్ లో వున్న కార్మికులను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. కాగా అనధికార వర్గాల సమాచారం ప్రకారం ఏకంగా సొరంగంలో 170 మంది కార్మికులు గల్లంతయ్యారని వార్తలు వస్తున్నయన్న అంశంపై ఆయన స్పందింస్తూ ముందుగా సొరంగంలో వున్నవారిని రక్షించడంపైనే తాము దృష్టి సారించామని అన్నారు,
దౌలిగంగా నదిలో అకస్మాక వరదలు సంభవించిన దుర్ఘటనలో ఉత్తరాఖండాలోని దాదాపు నిర్మితమైన ఓ జలవిద్యుత్ కేంద్రం పూర్తిగా కొట్టుకుపోగా, మరో విద్యుత్ కేంద్రానికి తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్రంలోని చమోలీ జిల్లా జోషిమర్ సమీఫంలోని సందాదేవి- హిమానీనదంలోని పెద్ద మంచు చరియలు విరిగిపడి దౌలిగంగా నదిలో పడిన కారణంగా ఈ నది ఒడ్డున తపోవన్- రేణి వద్ద నిర్మితం అయిన ఎన్టీపీసీ 480 మెగావాట్ విద్యుత్ కేంద్రం పూర్తిగా కొట్టకుపోయింది. ఇక మలారీ లోయలో వున్న భారీ వంతెనలు కూడా పూర్తిగా కొట్టకుపోయినట్టు అధికారులు తెలిపారు, చైనా సరిహద్దుల్లోని బోర్డర్ పోస్టులకు వెళ్లేందుకు ఈ వంతనే కీలకం కాగా, దీనితో పాటు మరో నాలుగు వంతెనలు కూడా ధ్వంసమయ్యాయి.
(And get your daily news straight to your inbox)
May 17 | షరియా చట్టం అమలుజరిగే ఇస్తామిక్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో.. అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో అమలుపర్చే బహిరంగ శిక్షలు పలు సామాజిక మాద్యమాల్లోనూ... Read more
May 17 | కంటికి కనిపించని శత్రువుతో యుద్దం చేస్తున్నామన్న భయాందోళన మధ్య కరోనా తొలి దశలో దేశప్రజలందరూ అప్రమత్తతో వ్యవహరించారు. అయినా భారీగానే కేసులు నమోదయ్యాయి. ఇక మరణాలు కూడా నమోదు కావడంతో దేశప్రజల్లో మరింత అందోళన... Read more
May 17 | ఓ వైపు మహారాష్ట్రలో బీజేపి అధికార ప్రతినిధి వినయక్ అంబేకర్ పై దాడి చేసిన నేపథ్యంలో దిగ్గుబాటు చర్యలకు దిగిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీపై మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా సంచలన అరోపణలు చేసింది.... Read more
May 16 | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేసిన బీజేపీ రాష్ట్రస్థాయి నేతపై దాడి చేసిన నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది.... Read more
May 16 | ఆయనో ప్రోఫెసర్.. ఎదిగిన విద్యార్థులకు ఉన్నతమైన వ్యక్తులుగా.. ప్రోఫెషనల్ కోర్సులను బోధించే గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్నాడు. అయితే ఆయన చేసిన పనే ఇప్పుడాయనను వార్తల్లో నిలిపింది. తాను ప్రోఫెసర్ అన్న విషయాన్ని మర్చిన ఆయన..... Read more