internet crackdown fuels anger ahead of farmers' 'chakka jam' రైతులు జాతీయ రహదారుల రాస్తారోకోలు.. ప్రశాంతం..

Farmers protest rakesh tikait gives ultimatum to centre after chakka jan ends

farmers protests, farmers protests delhi border, Chakka jam, Uttar pradesh, Haryana, Punjab, Andhra Pradesh, Telangana, barricades at delhi border, singhu border farmers protests, police barricades, protest delhi, farmers laws farm, republic day farmers, farmers tractor rally, farmers rally violent, farmers red fort, farmers farm laws, delhi police, delhi, politics

The three-hour-long 'chakka jam' agitation held by farmer unions against the three contentious farm laws and in protest against the Internet ban in areas near their agitation sites passed off peacefully on Saturday.

రైతుల జాతీయ రహదారుల రాస్తారోకోలు.. ప్రశాంతం..

Posted: 02/06/2021 08:02 PM IST
Farmers protest rakesh tikait gives ultimatum to centre after chakka jan ends

కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గత రెండు నెలలకు పైగా ఢిల్లీ శివారల్లో అన్నదాతలు నిరసనోద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన ట్రాక్టర్ ర్యాలి తరువాత మళ్లీ ఇవాళ రైతులు దేశవ్యాప్తంగా జాతీయ, రాస్ట్రీయ రహదారుల బంద్ కు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు సాగిన ఈ రహదారుల రాస్తారోకో కార్యక్రమం దేశవ్యాప్తంగా విజయవంతం అయ్యింది.

అన్నదాతలు చేపట్టిన రాస్తారోకో కార్యక్రమంలో రెండు మూడు రాష్ట్రాలో కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా అంతగా ప్రశాంతంగా విజయవంతమైంది. పలు ప్రధాన నగరాల్లో రైతు ఉద్యమ మద్దతుదారులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన సాగిస్తున్న రైతులకు మద్దతుగా అనేక రాష్ట్రాల్లోని రైతు సంఘాల నేతలు, పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతూ ఈ రాస్తారోకో కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. పలు ప్రధాన నగరాల్లో రైతు ఉద్యమకారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు.

పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో పలు చోట్ల రైతులు జాతీయ రహదారులను దిగ్బంధించారు. బెంగళూరు, పుణె, దిల్లీలో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బెంగళూరులోని యలహంక పోలీస్‌ స్టేషన్‌ బయట ఆందోళన చేస్తున్న రైతు మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని షాహీదీ పార్క్‌ వద్ద రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టిన నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వదిలేశారు. మొత్తంగా రైతులు పిలుపుకు యావత్ దేశంలోని రైతులు కదిలారు.

ఇటు తెలుగు రాష్ట్రాలలో కూడా రైతు సంఘాల నేతలు, సీఫీఎం, సీపీఐ, కాంగ్రెస్, సహా పలు రాజకీయ పార్టీలు నిరసనలు తెలిపాయి. అటు అమరావతిలో రైతు సంఘాల నేతలతో పాటు వామపక్ష నేతలు, పలు రాజకీయ పార్టీల నేతలు కలసి నిరసన తెలిపారు. ఇటు తెలంగాణలో రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు నిరసన చేపట్టాయి. హయత్‌నగర్‌ వద్ద జాతీయ రహదారిపై కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, తెజస శ్రేణులు ఎడ్ల బండ్ల ప్రదర్శనలో పాల్గొని సంఘీభవం ప్రకటించాయి. పీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నేతలు మల్‌రెడ్డి రాంరెడ్డి, అనిల్ కుమార్‌ యాదవ్‌ నేతృత్వంలో కార్యకర్తలు తరలివచ్చి రైతులకు మద్దుతు ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles