APSRTC offers quick darshan of Sri Varu for its passengers.. ఆర్టీసీలో ప్రయాణం.. గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం

Sheeghra darshanam to srivari devotees who travel tirumala by apsrtc

APSRTC, Seeghra Darshan, Tirumala Devotees, TTD quick darshan tickets, Padmavati Temple, Tiruchanoor, APTDC, Piligrims, Tirumala darshan, Tirumala Package, AP Tourism, Tirumala tirupati devasthanam, TTD Board, Diety Sri Venkateshwara swamy, Vada Prasadam, Kalyanam Laddu Prasadam, recommendation letters, SriVari darshanam, Dharma reddy, devotional

The Andhra Pradesh State Road Transport corporation board tie-up with Tirumala Tirupati Devasthanam and has bought a new scheme for the devotees. If devotees book a ticket to Tirumala from Hyderabad, Bangalore, Vishakapatnam, pudducherry, Chennai, Kanchi, Rajahmundry,Vijayawada and far off places to get Seeghra darshanam Tickets.

ఏపీఎస్ఆర్టీసీలో తిరుమలకు ప్రయాణం.. శ్రీవారి శీఘ్ర దర్శననాకి మార్గం..

Posted: 02/05/2021 01:25 PM IST
Sheeghra darshanam to srivari devotees who travel tirumala by apsrtc

సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెలసినన ఇల వైకుంఠపురంగా భక్తుల కొంగుబంగారంగా నిలిచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ తిరువేంకటేశ్వరుడి దర్శన భాగ్యం కలగాలంటే.. గంటల కొద్ది సమయం పడుతుంది. ఒక్కోసారి 24 నుంచి 36 గంటల సమయం కూడా పడుతుంది. అలాంటి శ్రీవారి దర్శనం మీకు కేవలం రెండు మూడు గంటల్లో కలగాలంటే.. పలు మార్గాలు వున్నాయి. అన్ లైన్ లో తిరుమల శ్రీవారు శీఘ్ర దర్శన టికెట్లను కూడా లభ్యమతుతున్నాయి. ఇది కాకుండా ఐఆర్సీటీసీలో తిరుమల ప్యాకేజ్ టికెట్లు పోందిన, విమానయానం చేసినా శీఘ్రదర్శనం లభ్యమవుతుందన్న విషయం తెలిసిందే.

ఇక కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కకావికలం చేసిన తరుణంలో తిరుమల కొండపై భక్తులను కూడా అడ్డుకున్నారు. ఇక అన్ లాక్ తో ఆలయాలకు ద్వారాలు తెరుచుకున్న తరువాత కూడా కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ భక్తులను తిరుమలకు పంపినా.. శ్రీవారి దర్శనభాగ్యం లభ్యంకావడానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. ఈ క్రమంలో తిరుపతికి రెండు కిలోమీటర్ల దూరంలో వున్న తిరుచానూరు పద్మావతి అమ్మావారి కటాక్షం పొందే భక్తులకు గంటల వ్యవధిలో దర్శనం కలిగించేలా అక్కడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సంస్థ ఈ మధ్య చర్యలు తీసుకుంది.

ఈ నేపథ్యంలో అటు రైల్వే పర్యాటకశాఖ, ఇటు రాష్ట్ర పర్యాటకశాఖ తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒప్పందాలు చేసుకుని తమ కస్టమర్లకు శీఘ్రదర్శనం కింద గంటల వ్యవధిలోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. ఏపీఎస్ఆర్టీసీ కూడా ఈ మేరకు అడుగులు వేసి.. తమ బస్సులలో తిరుమలకు చేరుకునే భక్తులకు శీఘ్రదర్శనం కల్పించనుంది. అందుకు టిక్కెట్లు రుసుము కన్నా రూ.300 అధికంగా చెల్లించాల్సివుంటుంది. ఉదయం 11 గంటలకు, సాయంత్రం నాలుగు గంటలకు రెండు స్లాట్లలో భక్తులను దర్శనానికి పంపుతారు.

టిక్కెట్ బుక్కింగ్ సమయంలో భక్తులు ఏ స్లాట్ లో వెళ్లగోరుతున్నారో ఆ వివరాలను తెలిపాల్సి వుంటుంది. ఈ స్కీములో రోజుకు 1000 టికెట్లను జారీ చేయనున్నామని తెలిపారు. ఈ టికెట్లు పొందిన వారికి త్వరితగతిన దర్శనం కల్పించేలా చూడడానికి తిరుమల బస్ స్టేషన్ లో ఆర్టీసీ సూపర్ వైజర్లను కూడా నియమించింది. కాగా, బెంగళూరు, హైదరాబాద్, పాండిచ్చేరి, విశాఖపట్నం, చెన్నై, కంచి, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles