India's Covid-19 less than 20 thousand mark దేశంలో ల‌క్ష‌న్న‌ర దాటిన క‌రోనా మృతుల సంఖ్య

Coronavirus in india india reports 18088 new cases taking tally to 1 03 crore

Coronavirus cases India, Coronavirus India update, Coronavirus india testing centres, coronavirus vaccine, coronavirus testing india labs, coronavirus deaths india, Coronavirus, Covid-19, Maharashtra, Tamil Nadu, Delhi, Health Ministry, corona fatility, corona cases India

India's COVID-19 case tally is less than 20 thousand mark with 18,088 new infections on Saturday. India's COVID-19 tally reached 1,03,74,932, including 99,97,272 recoveries and 2,27,546 active cases. The Covid-19 death toll has also surged to 1,50,114.

మరోసారి 20 వేలకు దిగువన కరోనా కేసులు.. 1.50 లక్ష దాటిన మరణాలు

Posted: 01/06/2021 08:27 PM IST
Coronavirus in india india reports 18088 new cases taking tally to 1 03 crore

(Image source from: Business-standard.com)

దేశంలో కరోనా మహమ్మారి కేసులు కోటి 3 లక్షల మార్కు దాటగా, అదే తరుణంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య కూడా ఏకంగా 99 లక్షల మార్కును దాటింది. కాగా ఇదే సమయంలో మరణాలు కూడా లక్షా 50 వేల మార్కును అధిగమించాయి. ఇవాళ మరోమారు దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గి ఏకంగా 20 వేల మార్కు దిగువకు చేరింది, దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 2.27 లక్షల మార్కుకు దిగువన రావడం దేశ వైద్యాధికారులకు ఊరటనిస్తోంది. గత పది మాసాలుగా దేశప్రజలను భయాందోళనకు గురిచేస్తూ లక్షకు పైగా ప్రజల ప్రాణాలను బలితీసుకున్న కరోనా.. గత నెల రోజులుగా క్రమంగా తన ప్రభావాన్ని తగ్గించుకుంటోందని భావిస్తుండగా మళ్లీ కేసులు రమారమి ముఫై వేల మార్కుకు దిగువన కేసులు నమోదు కావడం ఉపశమనం కలిగిస్తోంది.

తాజాగా దేశంలో కరోనా బారిన పడి ఏకంగా లక్షా 50 వేల మందికిపైగా మరణించగా, గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో అత్యల్పంగా మరణాలు సంభవించాయి. జూన్ 2 తరువాత ఈ స్థాయిలో మరణాలు అత్యల్పంగా నమోదు కావడం గమనార్హం. ఈ మరణాల్లో ఒక్క మహారాష్ట్రలోనే ఏకంగా 50 వేల మంది మృత్యువాత పడినట్టు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ తరువాత కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక మంది ప్రజలు అసువులు బాసారు, తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో 18,088 కేసులు నమోదయ్యాయి. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ.. లక్షలాధి మందిని తన ప్రభావానికి గురిచేస్తూ.. లక్షల మంది ప్రాణాలను హరించిన కరోనా మహమ్మారి దేశంలోనూ తన ఉదృతిని శరవేగంగా విస్తరించుకుంటోంది.

దేశంలో క్రమంగా జడలువిప్పిన తరువాత క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా మహమ్మారి బారిన ఇప్పటివరకు మొత్తంగా 1,03,74,932 మార్కును అందుకుంది. ఫలితంగా కరోనా ప్రభావనపడిన దేశాల్లో అమెరికా అత్యధిక కేసులతో అగ్రస్థానంలో వుండగా ఆ తరువాత రెండవ స్థానంలో భారత్ నిలువడం.. దేశంలో కరోనా ప్రభావాన్ని తెలియజేస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు ఉద్దృతి పెరుగుతున్న ఈ క్రమంలో కొంచెం కఠిన నిబంధనలు పెట్టాల్సిన కేంద్రం అన్ లాక్ 5.0 మార్గదర్శకాలలో రాకపోకలకు వెసలుబాటు కల్పించడం కూడా తీవ్రతను పెంచేందుకు కారణం అవుతుందన్న వాదనలు వినబడుతున్నాయి. స్వల్ప సంఖ్యలోని జనసమూహాలకు అనుమతులు కూడా లభ్యం కావడంతో.. కేంద్రం కూడా పలు ఆంక్షలను తొలగించి మరికోన్ని సడలింపులు కూడా అమల్లోకి రావడంతో మరిన్ని కేసులు పెరుగుతాయా.? అన్న అందోళన కూడా రేకెత్తుతోంది.

గత జూలై మాసంలో 19 లక్షల కేసులు ఇక ఆగస్టు మాసంలో మరో 20 లక్షల కేసులతో ఏకంగా రెండు నెలల వ్వవధిలోనే నలభై రెండు లక్షల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత భయాందోళనకరంగా మారిందో అర్థంచేసుకోవచ్చు. ఇదిలావుంటే సెప్టెంబర్ మాసంలో కరోనా దేశవ్యాప్తంగా జడలు విప్పింది. సెప్టెంబర్ 1 నాటికిక దేశంలో 36,91,166 కేసులు నమోదు కాగా, ఇక సెప్టెంబర్ 30 నాటికి ఈ సంఖ్య ఏకంగా రెట్టింపుకు చేరింది, సెప్టెంబర్ డేంజర్ ఎంతలా వుందంటే ఈ నేల రోజుల వ్యవధిలో ఏకంగా 25 లక్షల 34 వేల 597 కేసులు నమోదయ్యాయి, దీంతో కేసుల సంఖ్య 62,25,763కి చేరాయి, ఇక అక్టోబర్ మాసంలో ఇప్పటికే కరోనా విజృంభన తగ్గుముఖం పట్టిందని వస్తున్న వార్తలకు గణంకాలు కూడా అద్దం పడుతున్నాయి, ఇక అక్టోబర్ లో కేవలం 20 లక్షల కేసులు నమోదు కాగా, నవంబర్ 30 నాటికి ఈ కేసుల సంఖ్య 93 లక్షల మార్కుకు చేరాయి.

దేశంలో కరోనా బారిన పడిన కోటి మందికి పైగా బాధితుల్లో దాదాపుగా 99.97 లక్షలకు పైగా రోగులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 18,088 పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కోటి డెబై ఐదు వేల మార్కును అధిగమించింది. వీటిలో అత్యధిక కేసులు మహారాష్ట్ర, తమిళనాడులోనే నమోదయ్యాయి, దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య లక్ష 50 వేల మార్కును అధిగమించింది. దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్రలోనే అత్యదికంగా నమోదు కావడం గమనార్హం. అయితే కరోనా చికిత్స పోందుతున్న వారి కన్నా.. మహమ్మారి బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు స్వల్పంగా తగ్గి 94 శాతంగా నమోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  Covid-19  Maharashtra  Tamil Nadu  Delhi  Health Ministry  corona fatility  corona cases India  

Other Articles

  • Model diksha singh to contest up panchayat elections 2021

    ఉత్తర్ ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో గ్లామర్ డోసు..!

    Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more

  • Anand mahindra fulfills promise tn s famous idli amma gets new home workspace

    ఇడ్లీ బామ్మకు ఇల్లు కట్టించిన పారిశ్రామిక వేత్త

    Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more

  • Elangana mlas took drugs at bengaluru party police probe reveals

    బెంగళూరు డ్రగ్స్ కేసు: తెలంగాణలో బయటపడిన లింకులు

    Apr 03 | బెంగళూరు డ్రగ్స్‌ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more

  • Himanta biswa sarma pleads to revoke ban after ec bars him from campaigning

    హిమాంత తరువాత సుశాంతపై కూడీ ఈసీ బదిలీ వేటు

    Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more

  • Bjp lodges complaint against udhayanidhi stalin for remark against pm modi

    ప్రధాని మోదీపై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..

    Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more

Today on Telugu Wishesh