TRS to join 'Bharat Bandh' against farm laws రైతుల 'భారత్ బంద్కు' 14 పార్టీలు, కార్మీక సంఘాల మద్దతు..

Opposition parties trade unions back bharat bandh against farm laws

Bharat Bandh, farmers Bharat Bandh tomorrow, Farmers protest, corporates in Agri sector, farmers protest central bill, farmers produce trade and commerce, farmers empowerment and protection bill, farmers price assurance, farmers farm services act, farmers essential commodities, congress, national congress, Trianmool congress, BSP, SP, TRS, 14 Political parties, Trade Unions, Transport, Banking services

The Bharat Bandh (nationwide strike) called by farmers on Tuesday (December 8) in protest against three new farm laws passed by the Centre is set affect services across various sectors. The farmers claim that these laws end the minimum support price system in the future and will give corporates total control over agriculture sector. Banking , Transport Services may also be affected as several political parties and Trade unions have expressed their solidarity with farmers.

రైతుల ‘భారత్ బంద్’కు పెరుగుతున్న మద్దతు.. 14 పార్టీలు, కార్మీక సంఘాలు

Posted: 12/07/2020 05:12 PM IST
Opposition parties trade unions back bharat bandh against farm laws

(Image source from: Liveindia.tv)

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లు దేశంలోని కార్పోరేట్ దిగ్గజాలకు వ్యవసాయ రంగాన్ని అందించేదిగా వుందని.. రైతుల స్వేఛ్చకు విఘాతం కలిగిస్తూ కార్పోరేట్లకు అధిపత్యం వహించేలా వుందని నిరసిస్తూ రేపు భారత్ బంద్ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే ఉత్తరాది రైతులు గత పది రోజులుగా కేంద్రంతో జరుపుతున్న చర్చలు విఫలం కావడంతో.. వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్లు చోచ్చుకోచ్చే వీలు లేకుండా.. తమ పంటకు గిట్టుబాటు ధర లభించేలా చట్టాలను తీసుకురావాలని, నూతన వ్యవసాయ చట్టాలలో ఈ మేరకు మార్పులను చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

రైతులు వ్యక్తం చేస్తున్న డిమాండ్లపై కేంద్రంలోని పెద్దలు చర్చలు జరిపుతున్నారు. అయినా గత పది రోజులుగా తమ డిమాండ్ల సాధన కోసం రైతన్నలు హస్తినలోనే తిష్టవేశారు. తమ డిమాండ్లను సాధించుకునే వరకు తాము ఢిల్లీని వీడి వెళ్లబోమని తేల్చిచెబుతున్నారు. పది రోజులుగా తాము హస్తినలో ఆందోళన చేస్తున్నా.. డిమాండ్లను నెరవేర్చడంలో వైఫల్యం చెందుతున్న కేంద్ర వైఖరికి నిరసనగా రేపు రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి, దీంతో రైతు సంఘాలకు క్రమక్రమంగా దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే రైతుల సంఘాల భారత్ బంద్ కు కాంగ్రస్, ఎన్సీపీ, తృణముల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బీఎస్సీ, అప్, వాపపక్ష పార్టీలు, టీఆర్ఎస్ సహా 14 రాజకీయ పార్టీలు మద్దతును ఇస్తున్నాయి.

దీంతో అటు రవాణా, ఇటు బ్యాంకింగ్, మరోవైపు కార్మిక సంఘాలు కూడా మద్దుతును ప్రకటించాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి రైతుల అంధోళన అన్ని సమస్యలను పెనవేసుకుని చేస్తున్నట్లుగా, కేంద్రప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు ఇది సంకేతగా పలు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో రేపు బ్యాంకింగ్, రవాణ సర్వీసులకు విఘాతం ఏర్పడే అవకాశాలు లేకపోలేదని సమాచారం. అయితే రైతుల ముసుగు దరించి పలువురు నకిలీ రైతులను రోజుకు మూడున్నర వందలు ఇస్తామని తీసుకువచ్చారని ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని పలువురు బాధితులు చెబుతున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే ఏది నిజం అన్న మాట అటుంచితే.. నూతన వ్యవసాయ బిల్లు ఆచరణలోకి వస్తే.. దేశీయ కార్పోరేట్లకు ఆ రంగంలోనూ గేట్లు తెరిస్తే.. ఇక బియ్యం, కూరగాయలు సామాన్యుల పాలిట అందని ద్రాక్షాగా మారడం ఖాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles