Cyclone Nivar makes landfall in Puducherry తమిళనాడులో పెను విధ్వంసం సృష్టిస్తూ తీరం దాటిన 'నివర్'..

Cyclone nivar makes landfall rains pound tamil nadu coast

Cyclone Nivar: Heavy rains lash TN, strong winds caused damages, Damages, Cyclone Nivar, Cyclone in Tamil Nadu, Karaikal, Chennai weather, Chennai Storm, Cyclone Nivar, Nivar cyclone, Cyclone Gaja, Landfall of Nivar cyclone, Tamil Nadu, Puducherry, Karaikal, Heavy rains, Very heavy rainfall, Weather update, Climate, Rainfall status, Rain in Chennai, Rain in Tamil Nadu

Cyclone Nivar made a late-night landfall near Puducherry. The tropical storm has weakened from a 'very severe cyclonic storm' to a 'severe cyclonic storm' with a wind speed of 100-110 km per hour, gusting up to 120 km per hour, the weather office said in a statement.

తమిళనాడులో పెను విధ్వంసం సృష్టిస్తూ తీరం దాటిన ‘నివర్’.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్

Posted: 11/26/2020 02:06 PM IST
Cyclone nivar makes landfall rains pound tamil nadu coast

తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన తీవ్ర తుఫాను నివర్.. పెను విధ్వంసం సృష్టిస్తూ ఈ తెల్లవారు జామున 2.30 గంటలకు తీరం దాటింది. పెను తుఫానుగా తీరం దాటిన నివర్ ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కోనసాగుతోంది. కాగా నివర్ తుపాను తీరం దాటిన సమయంలో వాతావరణ శాఖ అంచనాలకు మించిన వేగంతో ఈదురు గాలులు వీచాయి. భారత వాతావరణ 110 నుండి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసినా.. నివర్ తుపాను తీరం దాటే సమయంలో అంతకు మించి 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

దీనికి తోడు భారీ వర్షాలు కురువడంతో తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల ప్రజలు కంటి మీద కునుకు కరువయ్యింది. మరీ ముఖ్యంగా తిరువణ్ణామలై, కడలూరు, విలుప్పురం, చెన్నై, కల్లకురిచ్చి ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని, మరో మూడు రోజుల పాటు తుపాను ప్రభావం కొనసాగుతుందని హెచ్చరించారు. అటు పుదుచ్చేరి తీర ప్రాంతంలోనూ భారి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఇక దీని ప్రభావం ఇటు ఆంధ్రప్రేదశ్ రాష్ట్రంపై కూడా కోనసాగుతుందని, కోస్తాంధ్ర తీరంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయని అన్నారు. వర్షాలతో తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Cyclone Nivar Damages

తమిళనాడులోని తీర ప్రాంతాల రోడ్లు చెరవులను తలపిస్తున్నాయి, తుపాను ప్రభావంతో తమిళనాడులో ప్రాథమిక అంచనా ప్రకారం 80 చెట్లు నేలకూలాయి, పలు పూరిళ్లు ధ్వంసమయ్యాయి, గాలుల ధాటికి అనేక ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి, రైతన్నలకు కూడా నివర్ తుపాను భారీ నష్టాన్ని మిగిల్చింది. తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షంతో వేల ఎకరాల్లోని పంట నీట మునిగింది. కాగా, తుపాను తీరం దాటిన తరువాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను కోనసాగిస్తున్నాయి. కూలిన చెట్లను యుద్ద ప్రాతిపదికన తొలగిస్తూ.. రవాణ, టెలికమ్యూనికేషన్, విద్యుత్ వ్యవస్థలను పునరుద్దరించేందుకు ఆయా శాఖల సిబ్బంది పనులు కోనసాగిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles