Centre fatal attack on farming community: Rahul Gandhi వలస కార్మికులు, రైతులను నట్టేల ముంచుతున్న మోడీ సర్కార్.!

You didnt count so no one died rahul gandhi taunts pm over migrants

Rahul Gandhi Taunts PM Over Migrants death, Migrants plight, Centre on death of migrants during lockdown, Rahul Gandhi, migrant workers, Modi govt, Lok Sabha, Santosh Gangwar, Bhartruhari Mahtab, Modi government, national politics

Turning to verse to attack the Centre for its statement that it does not have data on the number of migrants who died during the lockdown, Congress leader Rahul Gandhi on Tuesday said the world saw the deaths but only the Modi government was unaware.

వలస కార్మికులు, రైతులను నట్టేల ముంచుతున్న మోడీ సర్కార్.!

Posted: 09/15/2020 06:40 PM IST
You didnt count so no one died rahul gandhi taunts pm over migrants

కేంద్రం రైతులకు సంబంధించి లోక్ సభలో ప్రవేశపెట్టిన మూడు బిల్లులతో పాటు లాక్ డౌన్ నేపథ్యంలో దేశ అభివృద్దిలో కీలక భూమిక పోషించే వలస కార్మికులపై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలోని ప్రభుత్వం అటు కార్షకుల నుంచి వారి పంటతో పాటు భూములను కూడా లాక్కునేందుకు బిల్లలను ప్రవేశపెట్టిందని అరోపిస్తూనే.. ఇటు లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వలస కార్మికులను ఆదుకోవడంలోనూ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. అసలు లాక్ డౌన్ సమయంలో ఎంతమంది వలస కార్మికులు మరణించారన్న లెక్కలు కూడా లేవంటే.. వలస కార్మికుల జీవితాల పట్ల కేంద్రానికి వున్న వైఖరి ఎలాంటిదో అద్దం పడుతోందని ఆయన అన్నారు.

కరోనా నియంత్రణకు దేశానికి లాక్ డౌన్‌ విధించిన కేంద్రం.. వలస కార్మికులు వారి ఆకలి, దప్పికలకు కూడా లాక్ డౌన్ విధించిందా..? లేక వారి జీవితాలకే లాక్ డౌన్ విధించిందా.? అని ప్రశ్నించారు. దేశంలో బడా పారిశ్రామిక పెద్దలకు కోటాను కోట్ల రూపాయలను అప్పన్నంగా మాఫీ చేస్తున్న ప్రభుత్వం.. దేశంలోని రైతులకు మాత్రం కుడి చెత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాక్కునే కార్యాలకు శ్రీకారం చుట్టేలా మూడు బిల్లులను ప్రవేశపెట్టిందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. అదే సమయంలో వలస కార్మికుల మరణాలకు సంబంధించిన గణాంకాలు తమ వద్ద లేవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించటంపై కూడా ఆయన తీవ్రంగామండిపడ్డారు.

‘‘లాక్‌డౌన్‌ సమయంలో ఎందరు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారో, ఎందరు ఉపాధి కోల్పోయారో మోదీ ప్రభుత్వానికి తెలియదు. కార్మికుల మరణాలను ప్రపంచం చూసింది, కానీ మోదీ ప్రభుత్వానికి ఆ సంగతే తెలియదు. వారిపై ఈ మరణాల ప్రభావం ఏమాత్రం పడలేదు. వారు లెక్కించనంత మాత్రాన మరణాలు సంభవించనట్లేనా?’’ అని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నించారు. కేంద్రం లెక్కించలేదంటే అసలు మరణాలు సంభవించలేదని సంకేతాలను ప్రజల్లోకి పంపుతున్నారా.? అని ఆయన ప్రశ్నించారు. లేక దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషించే వలస కార్మికుల మరణాలు వల్ల తమ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపదని భావిస్తున్నారా.? అని రాహుల్ గాంధీ కేంద్రాన్ని నిలదీశారు. మృతిచెందిన వలసకార్మికులకు పరిహారం ఇవ్వలేమని ఈ విధంగా కేంద్రం తప్పించుకుంటోందని రాహుల్ ధ్వజమెత్తారు. మృతి చెందిన వలస కార్మికుల వివరాలు లేకపోవటం ప్రభుత్వ వైఫల్యమని అభిప్రాయపడ్డారు.

ఇక ఇదే సమయంలో కేంద్రప్రభుత్వం రైతులపై కోలుకోలేని దెబ్బ వేసిందని ఆరోపించారు. ‘లోక్ సభలో ప్రవేశపెట్టిన బిల్లులు రైతులపై కోలుకోలేని దెబ్బ వేశాయి. వాటి ద్వారా రైతులు కనీస మద్దతు ధర పొందలేరు. అంతేకాకుండా రైతులు తమ భూముల్ని బలవంతంగా పెట్టుబడిదారులకు అమ్ముకోవాల్సి వస్తుంది. మోదీజీ రైతులపై చేస్తున్న మరో కుట్ర ఇది’ అని ఆరోపించారు. రైతులు పంట పెట్టుబడికి కావల్సిన వస్తువులను రిటైల్‌ ధరలకు కొనుక్కుని.. తాము పండించిన పంటను మాత్రం హోల్‌సేల్‌ ధరకు అమ్ముకుంటున్నారన్నారని రాహుల్ ధ్వజమెత్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles