Social Activist Swami Agnivesh no more ప్రముఖ సామాజికవేత్త స్వామి అగ్నివేశ్ ఇక లేరు!

Renowned social activist swami agnivesh passes away

Swami Agnivesh,Swami Agnivesh assaulted,Swami Agnivesh attacked,Demise, Liver Decease, ILBS, tributes, social activist, child labour, national news, New Delhi

Social activist Swami Agnivesh died after a cardiac arrest at the Institute of Liver and Biliary Sciences in Delhi. He was 80 years old. Admitted to the hospital on Tuesday, Swami Agnivesh was being treated for liver cirrhosis and had been on ventilator support following multi-organ failure.

ప్రముఖ సామాజికవేత్త స్వామి అగ్నివేశ్ కన్నుమూత

Posted: 09/12/2020 01:46 PM IST
Renowned social activist swami agnivesh passes away

ఆర్యసమాజ్ నేత, జాతీయస్థాయి సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ పరమపదించారు. అనగారిన వర్గాల పక్షాన నిలిచిన గొంతు మూగబోయింది. బాధితవర్గాల పక్షాన పోరాటిన మహాశక్తి తరలివెళ్లిపోయింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఢిల్లీలోని అసుపత్రిలో చికిత్స పోందుతూ మరణించారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఢిల్లీలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిల్లరీ సైన్సెస్ (ఐఎల్బీఎస్)లో చికిత్స పొందుతున్న అగ్నివేశ్ శరీరంలోని బహుళ అవయవాలు చికిత్సకు స్పందించకపోవడంతో మరణించారు. గత నాలుగు రోజులుగా ఆయనను వెంటిలేటర్ పై ఉంచి చికిత్సను అందించినా ఫలించలేదు.

ఈ తరుణంలో నిన్న రాత్రి ఆయన గుండెపోటు రావడం.. అప్పటికే పలు అవయవాలు చికిత్సకు సహకరించకపోవడంతో పేదల పక్షాన నిలిచిన ధైర్యం అనంతవాయువులలో ఐక్యమైంది. ఆయనను బతికించేందకు వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. అందరినీ విషాదానికి గురిచేస్తూ స్వామి అగ్నివేశ్ తుదిశ్వాస విడిచారు. గిరిజనులు, అదివాసీల పక్షాన నిలిచి వారికి అగ్నివేశ్ అండగా నిలబడ్డారు. వీరితో పాటు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా బాలకార్మిక వ్యవస్థకు కూడా ఆయన వ్యతిరేకంగా గళం విప్పారు, అణగారినవర్గాల మహిళలకు అండగా నిలిచారు.

స్వామి అగ్నివేశ్ వయసు 80 సంవత్సరాలు. ఆయన 1939 సెప్టెంబరు 21న శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. ఆయన అసలు పేరు వేప శ్యాంరావు. ఆయన కోల్ కతాలో విద్యాభ్యాసం చేశారు. లా, కామర్స్ అంశాల్లో పట్టా అందుకున్నారు. ఆర్యసభ అనే రాజకీయ పార్టీని స్థాపించిన స్వామి అగ్నివేశ్ 1977లో హర్యానాలో శాసనసభ్యుడిగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. నాడు ఉమ్మడి ఏపీలో మావోయిస్టులతో చర్చలు జరిపిన సమయంలో అగ్నివేశ్ ప్రముఖ పాత్ర పోషించారు. స్వామి అగ్నివేశ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ వేత్తలు తమ దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swami Agnivesh  Demise  Liver Decease  ILBS  New Delhi  tributes  social activist  child labour  national news  

Other Articles