1 in 5 affected by Covid-19, reveals sero survey ఏపీ జనాభాలో కోటిమందికి కరోనా.. వచ్చింది.. పోయింది: సీరో సర్వే

Nearly 20 percent of ap population had covid 19 finds statewide sero survey

Andhra Pradesh sero-survey, Sero-survey in Andhra Pradesh, corona infections in AP, CM YS Jagan, Andhra Pradesh covid cases, Andhra Pradesh coronavirus, covid 19, sero survey, twenty percent population, Andhra Pradesh

The result of a serosurvey in Andhra Pradesh has shown that 19.7 per cent of people have developed antibodies to COVID-19. It also revealed that a high percentage of people who had contracted the coronavirus were asymptomatic, said the state government.

ఏపీ జనాభాలో కోటిమందికి కరోనా.. వచ్చింది.. పోయింది: సీరో సర్వే

Posted: 09/12/2020 11:08 AM IST
Nearly 20 percent of ap population had covid 19 finds statewide sero survey

కరోనా వైరస్ ప్రభావం ఏయే రాష్ట్రాల్లో ఎంతగా వుందన్న విషయాలను తెలుసుకునే పనిలో భాగంగా పలు సంస్థలు సర్వేలకు మొగ్గుచూపుతున్నాయి, ఇటీవల సీసీఎంబి నిర్వహించిన సర్వే ప్రకారం హైదరాబాద్ మహానగరంలో ఆరు లక్షల అరవై వేల మందిపై కంటికి కనిపించని శత్రువు దాడి చేశాడని, అయితే నగరవాసుల్లో దాదాపుగా దాడి చేసిన వారందరూ శత్రువుతో తెలియకుండానే బాగా పోరాడారని దీంతో శత్రువు ఓటమిని చవి చూశాడని కూడా సర్వే నివేదికలు వెల్లడించాయి. కాగా ఒక్కటి నుంచి రెండు శాతం మాత్రం దీని ప్రభావానికి గురై అసుపత్రుల పాలయ్యారని తెలిపాయి. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ ఓ సర్వే సంస్థ నిర్వహించిన సర్వోలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

సీరో సంస్థ నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు 5 కోట్ల మంది జనాభాలో ఇప్పటికే కోటి మందిపైగా ( దాదాపుగా రాష్ట్ర జనాభాలో 19.7 శాతం మందికి) కరోనా వైరస్ సోకిందని.. కంటికి కనిపించని శత్రువు ఎలా వచ్చిందో అలానే వెళ్లిపోయినట్టు తేలింది. వైరస్ వ్యాప్తి తీవ్రతను గుర్తించేందుకు ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సీరో సర్వే నిర్వహించింది. తొలి దశలో అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో సర్వే నిర్వహించింది. రక్తంలోని సీరంలో ఉన్న యాంటీబాడీల ఆధారంగా కరోనా సోకిందీ, లేనిదీ నిర్ధారించవచ్చు. ఈ సందర్భంగా ఈ నాలుగు జిల్లాలో నిర్వహించిన సర్వేలో 15.7 శాతం మందికి కరోనా సోకి వెళ్లిపోయినట్టు తేలింది.

మిగిలిన తొమ్మిది జిల్లాలలో రెండో దశలో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో వెల్లడైన విషయాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ నిన్న వెల్లడించారు. రెండో దశ సర్వేలో భాగంగా ఒక్కో జిల్లా నుంచి 5 వేల మంది చొప్పున 9 జిల్లాల నుంచి మొత్తం 45 వేల నమూనాలు సేకరించారు. వారిలో 19.7 శాతం మందికి వారికి తెలియకుండానే వైరస్ సోకి వెళ్లిపోయినట్టు నిర్ధారణ అయింది. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 30.6 శాతం మందిలో, కర్నూలు జిల్లాలో 28.1 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 21.5 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించారు.

చిత్తూరు జిల్లాలో 20.8 శాతం, విశాఖపట్నంలో 20.7 శాతం, కడపలో 19.3 శాతం, గుంటూరు జిల్లాలో 18.2 శాతం, ప్రకాశం జిల్లాలో 17.6 శాతం మందిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందాయి. అతి తక్కువగా పశ్చిమగోదావరి జిల్లాలో 12.3 శాతం మందిలో యాంటీబాడీలు కనిపించాయి. తెలియకుండానే వైరస్ సోకిన వారిలో 19.5 శాతం మంది పురుషులు కాగా, 19.9 శాతం మంది మహిళలు ఉన్నారు. వైరస్ వ్యాప్తి ఏయే జిల్లాల్లో ఎలా ఉందో తెలుసుకునేందుకే సర్వే నిర్వహించినట్టు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ తెలిపారు. భవిష్యత్ కార్యాచరణకు ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles