9 Trapped After Fire At Hydroelectric Plant In Telangana శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్నిప్రమాదం: తొమ్మిది మంది సిబ్బంది మృతి

Nine dead in fire mishap at srisailam underground hydel power house

Telangana fire, Telangana dam power station fire, Srisailam dam fire, Srisailam dam, Srisailam Power Station, Srisailam Power Station fire, srisailam power project, nine dead, Srisailam Fire Accident, hydel pump house, NDRF, Jagadish Reddy, KCR, Telangana

Nine people have died in a fire mishap inside the underground Srisailam left bank 900 MW power house following an electrical shortcircuit that got triggered at 1030 pm last night. Rescue operations taken up by the NDRF and teams from Singareni Collieries Company Limited, in the power house under the Telangana, were in vain due to tough smoky conditions.

శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్నిప్రమాదం: తొమ్మిది మంది సిబ్బంది మృతి

Posted: 08/21/2020 07:07 PM IST
Nine dead in fire mishap at srisailam underground hydel power house

శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో చిక్కుకుపోయిన తొమ్మిది మంది సిబ్బంది ప్రాణలు కోల్పోయారు, శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో దట్టమైన పోగ అలుముకోవడంతో అటంకాల మధ్య కోనసాగిన సహాయక చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సింగరేణి కాలరీస్ కు చెందిన అత్యయిక బృందాలు పవర్ ప్లాంటులో చిక్కకుపోయిన తొమ్మిది మంది మృతదేహాలను వెలికి తీశారు, తొలుత ఒక్కరి మృతదేహమే లభించడంతో మిగతావారు సురక్షితంగానే వుంటారన్న ఆశలు అడియాశలయ్యాయి.

ఆ తరువాత మరో రెండు మృతదేహాలను వెలికి తీయగా మొత్తంగా మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను ఏఈ మోహన్ కుమార్‌, ఏఈ ఉజ్మ ఫాతిమా, ఏఈ సుందర్ లుగా గుర్తించారు. కాగా, కాసేపటికి మరో మూడు మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి, వీరిని ఢీఈ శ్రీనివాస్, వెంకట్రావ్, రాంబాబులుగా గుర్తించారు. కాగా సంస్థలో చిక్కుకుపోయిన మరో జూనియర్ ప్లాంట్ అటెండర్ కిరణ్ తో పాటు అమ్రాన్ కంపెనీకి చెందిన వినేష్, మహేష్ ఇక మిగిలిన మృతదేహాల కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతూనే వుంది, తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాగర్‌ కర్నూల్‌ కలెక్టర్‌ శర్మన్‌, ట్రాన్స్‌కో సీఈ రమేశ్‌ తదితరులు సహాయక చర్యలను దగ్గరుడి పర్యవేక్షిస్తున్నారు.

ఇక ఆ తరువాత మొత్తంగా ప్రమాదఘటనలో ప్లాంటులోనే చిక్కకుపోయిన వారి కోసం సహాయక చర్యలు సాగుతూనే వున్నాయి, కాగా దట్టమైన పొగ అలుముకున్న నేపథ్యంలోనూ సహాయక చర్యలు చేపట్టిన బృందాల్లోని సభ్యులు కూడా అస్వస్థతకు గురయ్యారు. ప్యానల్‌ బోర్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి విస్పోటనం సంభవించింది. భారీ శబ్దాలు వినిపించడంతో భయాందోళనకు గురైన సిబ్బంది ఏంటా అని అరా తీసే లోపు దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ పొగలు ఎక్కడి నుంచి వస్తుందో అని పరిశీలనకు వెళ్లిన తొమ్మది మంది సిబ్బంది లోపలే చిక్కుకుపోయారు. కాగా, వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఉద్యోగుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles