Ashok Gehlot-govt wins trust vote in assembly రాజస్థాన్ సంక్షోభం: పైఎత్తుతో 'విశ్వాసం' గెలిచిన గెహ్లోట్ సర్కార్

Winning trust vote a message to forces trying to destabilise elected govts says ashok gehlot

AICC, Rajasthan Government, Sachin Pilot BJP, Ashok Gehlot status, rebellion in Rajasthan, Rajasthan floor test, rajasthan floor test, rajasthan trust vote, rajasthan government crisis, rajasthan government crisis news, rajasthan floor test results, Rajasthan Assembly, Gulab Chand Kataria, Rajasthan political crisis, Sachin Pilot loyalist MLAs, Sachin Pilot loyalist MLAs Manesar, Manesar, Haryana, Jaipur, Rajasthan, Congress, Politics

The Congress government led by Chief Minister Ashok Gehlot on Friday won the motion of confidence, ending the threat triggered by a rebellion within the Congress ranks in the state.

రాజస్థాన్ సంక్షోభం: పైఎత్తుతో ‘‘విశ్వాసం’’ గెలిచిన గెహ్లోట్ సర్కార్

Posted: 08/14/2020 11:38 AM IST
Winning trust vote a message to forces trying to destabilise elected govts says ashok gehlot

రాజస్థాన్ లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన అంతర్గత విభేదాలను పరిష్కరించుకుని.. అసెంబ్లీలో అడుగుపెట్టిన అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఎందరె ఎన్ని పన్నాగాలు పన్నినా చివరకు తమకు ప్రజామోదం కలిగివుంటుందని మరోమారు అసెంబ్లీలో తనంతట తాను ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలోనూ విజయం సాధించింది. విపక్ష బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాన్ని అందించకుండా ఎత్తుకు పెఎత్తు వేసి మరీ.. బీజేపి ఆశలపై నీళ్లు చల్లింది. ఇక ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూజువాణి ఓటుతో నల్లేరుపై నడకలా విజయాన్ని అందుకుంది, ఈ బల పరీక్ష ముగిసిన అనంతరం రాజస్థాన్ అసెంబ్లీ ఈ నెల 21కి వాయిదా పడింది.

అంతకుముందు రాజస్థాన్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి తొలుత సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. అధికార, విపక్షాల మధ్య వాడీవేడిగా చర్చలు కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వం డబ్బు, అధికారం ఉపయోగించి మధ్యప్రదేశ్‌, మణిపూర్‌ ,గోవాలో ప్రభుత్వాలను  పడగొట్టిందన్న మంత్రి.. అదే మంత్రాన్ని రాజస్థాన్‌లో ప్రయోగించగా బెడిసికొట్టిందని విమర్శలు గుప్పించారు. గహ్లోత్‌ నేతృత్వంలోని సర్కార్‌ను కూలదోసేందుకు కేంద్రం ప్రయత్నించి విఫలమైందని విమర్శించారు. అనంతరం మూజువాణి ఓటింగ్ ద్వారా విశ్వాస పరీక్షకు వెళ్లిన గెహ్లోట్ ప్రభుత్వం విజయాన్ని అందుకుంది.

అనంతరం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ మాట్లాడుతూ.. తమ విజయం కొందరికి చెంపపెట్టులాంటిదని అన్నారు. అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రలోభాలతో వారిని తమ వైపుకు తిప్పుకుని ప్రజాస్వామ్య బద్దంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలను పడగొట్టే పార్టీలకు ఈ విజయం గోప్ప సందేశాన్ని ఇస్తుందని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపి ప్రయత్నించిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లో కాపాడుకుంటామన్నారు. ఈ విజయం రాజస్థాన్ ప్రజా విజయంగా ఆయన అభివర్ణించారు, అనంతరం సచిన్ పైలట్ మాట్లాడుతూ ఎవరెన్ని ఎత్తులు వేసినా చివరకు గెలిచింది మాత్రం తమ ప్రభుత్వమేనని అన్నారు.

ప్రభుత్వాలను కూలదోసేందుకు ప్రయత్నాలు చాలించి.. రాష్ట్ర ప్రగతికి దోహదపడితే మంచిచిదని సూచించారు, రాజస్థాన్ లో తమ ప్రభుత్వం విజయం సాధించడం, విశ్వాస పరీక్షలో నెగ్గడం సంతోషంగా వుందన్నారు, రాజస్థాన్ ప్రజల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని కలసి పనిచేస్తామన్ని పైలట్ అన్నారు, ఇటీవల, సీఎం అశోక్ గెహ్లాట్ కు, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కు మధ్య విభేదాలు ముదిరి పాకాన పడి రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ పరిణామాలను సొమ్ము చేసుకునేందుకు బీజేపీ శతవిధాలుగా ప్రయత్నించినా, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్లు రంగంలోకి దిగి సచిన్ పైలట్ ను తిరిగి అశోక్ గెహ్లాట్ చెంతకు చేర్చగలిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles