తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకూ రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు తాజాగా ఎనబై ఎనమిది వేల మార్కును దాటింది. వీటికి తోడు మరణాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణ వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా నమోదైన మరణాలతో తెలంగాణ.. ఏకంగా మరణాలలో 670 మార్కును అందుకోవడం కూడా అందోళన రేకెత్తిస్తోంది. ఇదివరకే దేశంలో సంభవించిన కరోనా మరణాల్లో ఇప్పటికే తెలంగాణ పదవ రాష్ట్రంలో నమోదు చేసుకుంది. ఈ తరుణంలో ప్రతి రోజు మరణాలు నమోదు కావడం కూడా అంధోళనకర అంశమే. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో రాష్ట్రంలో తగ్గినా.. మళ్లీ పెరుగుతున్న కేసులు, మరణాలు వారి పనితీరుకు సవాల్ విసిరేలా తయరావుతున్నాయి.
తెలంగాణలో మే నెల 7 నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోన్నాయి. కాగా జూన్ నెలలో కేంద్రం దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కు పలు సడలింపులు తీసుకురావడంతో జనజీవనం వేగాన్ని అందుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని నగరంలో కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సి వున్నా.. అటు ప్రభుత్వం కానీ, ఇటు ప్రజలు కానీ జాగ్రత్త చర్యలు పాటించకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా విజృంభన కోనసాగుతోంది. హైదరాబాద్ నగరం చుట్టూరా కరోనా మహమ్మారి మాటు వేయడం అందోళన రేపుతోంది. అయితే గ్రేటర్ లో కరోనా నియంత్రణకు కఠినమై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. కరోనా వ్యాప్తి మాత్రం అగడం లేదు. తాజాగా ఏకంగా 1921 వేలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధికంగా 356లకు పైగా కేసులు నమోదు కావడంతో నగరవాసుల్లోనూ ఆందోళనకు దారి తీస్తోంది.
గత పక్షం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోనూ పెరుగుతూ వచ్చిన కరోనా పాజిటివ్ కేసులు ఇవాళ కాసింత తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా తెలంగాణలో అంతకంతకూ పెరుగుతున్న కేసులు తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కేసులతో కలిపి మొత్తంగా ఎనబై ఎనమిది వేల మార్కును చేరింది, దీంతో ఈ స్థాయిలో కరోనా కేసుల నమోదు చేసుకున్న 7వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తాజాగా రాష్ట్రంలో 1921 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ లో ఇదివరకు ఎన్నడూ నమోదు కాని అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఏకంగా 356 కోరానా పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, ఇవాళ గ్రేటర్ పరిధితో పాటు రంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, వరంగల్ అర్భన్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లోనూ కరోనా కేసులు అధికసంఖ్యలో నమోదయ్యాయి.
అయితే గత వారం రోజులుగా నమోదవుతున్న కేసుల తెలంగాణవాసులను కలవరానికి గురిచేస్తోంది. హైదరాబాద్ లో పంజా విసురుతున్న కరోనా.. ఇక జిల్లాల్లోనూ తన ఉద్దృతిని చాటుకుంటోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసులు మొత్తంగా 88000 మార్కును దాటిన విషయం తెలిసిందే, ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులెవరికీ కరోనా పాజిటివ్ నిర్థారణ కాలేదని, అన్ని రాష్ట్రానికి చెందిన వారివేనని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో మరణాల సంఖ్య మళ్లీ పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో కరోనా బారిన పడి అసుపత్రులలో చికిత్సపోందుతూ తొమ్మిది మంది అసువులు బాసారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 674కు చేరింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో ఉగ్రరూపం దాల్చిన కరోనా కేసులు గత వారం రోజులుగా కాసింత తగ్గుముఖం పడుతున్నాయి. అయితే అదే సమయంలో జిల్లాల్లో వ్యాప్తి పెరుగుతోంది.
తాజాగా నమోదైన ఇవాళ నమోదైన 1921 కేసులతో మొత్తంగా రాష్ట్రంలో 88,396 కేసులు నమోదయ్యాయి. కాగా, తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 356, రంగారెడ్డి జిల్లాలో 134, మేడ్చల్ మల్కాజ్‌గిరి 168, సంగారెడ్డిలో 90, సిద్దపేట జిల్లాలో 63, కరీంనగర్ జిల్లాలో 73, నల్గోండ జిల్లాలో 73, సూర్యాపేట జిల్లాలో 47, జోగులాంబ గద్వాల జిల్లాలో 51, కామారెడ్డి జిల్లాలో 44, మహబూబ్ నగర్ జిల్లాలో 48, జగిత్యాల జిల్లాలో 40, జనగామ జిల్లాలో 38 కేసులు నిర్థారణ అయ్యాయి, కరోనా బారినపడిన బాధితులు కోలుకొన్న పలువురు రోగులను అధికారులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు. దీంతో మొత్తంగా 64,284 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23,438 యాక్టివ్ కేసులు వున్నాయని, ఇక హోమ్ ఐసోలేషన్ లో 16,439 మంది చికిత్స పోందుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Jan 11 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం... Read more
Jan 11 | భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్లో... Read more
Jan 11 | ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును... Read more
Jan 11 | వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా... Read more
Jan 11 | జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని... Read more