BCG vaccine does protect against Covid-19: study కరోనా చీకట్లలో చిరు దీపంలా బీసీజీ వాక్సీన్.!

Century old tb vaccine may bring down mortality rates of covid 19

Albert Calmette, Camille Guerin, Tuberculosis vaccine, Tuberculosis, BCG, Germany, Germans, Pernambuco, Rio de Janeiro, Sao Paulo, Brazil, Mexico City, Mexico, New York, Illinois, Louisiana, Bacille Calmette Guerin, National Institute of Allergy, coronavirus, coronavirus outbreak, coronavirus pandemic, global pandemic, outbreak, pandemic, self isolation, quarantine, social distancing, self quarantine, India, China, Wuhan, Covid 19, Covid, Coronavirus, Coronavirus India, Coronavirus India Updates, World Health Organisation

A century-old tuberculosis vaccine may play a role in reducing death due to Covid-19 infection, a preliminary study has suggested. Researchers from the US-based the National Institute of Allergy and Infectious Diseases of the National Institutes of Health made the link to Bacille Calmette-Guerin, or BCG, after comparing data on Covid-19 mortality rates across the globe.

కరోనా చీకట్లలో చిరు దీపంలా బీసీజీ వాక్సీన్.!

Posted: 07/10/2020 10:08 PM IST
Century old tb vaccine may bring down mortality rates of covid 19

కొవిడ్-19 వైరస్ ఎంతటి ప్రమాదకారి వైరసో ఇప్పటికే ప్రపంచవ్యాప్త ప్రజలకు అవగతమైంది. దీంతో ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు అనేక దేశాలు తమ పరిశోధనలకు పదను పెట్టాయి. ఈ క్రమంలో భారత్ సహా పలు దేశాల శాస్త్రవేత్తలు ప్రయత్నాలు విజయపథం వైపు సాగుతున్నాయి. కరోనాకు వాక్సీన్ తయారు చేసిన దేశాలు ప్రస్తుతం హ్యూమన్ ట్రయల్స్ కొనసాగిస్తున్నాయి. ఇవి ఎప్పుడెప్పుడు పూర్తి చేసుకుని మార్కెట్ లోకి వాక్సీన్ ను ఎప్పుడు ప్రవేశపెడతాయా.? అని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కారుచీకట్లను కమ్మడంతో అనేక అధ్యయనాలు సాగుతున్న నేపథ్యంలో ఆశలు చిగురించేలా చేస్తోంది ఓ అధ్యయనం. కారుచీకట్లను తరిమే చిరు దీపంలా.. శతాబ్దపు కాలం నాటి బీసీజీ వ్యాక్సీన్ పనిచేస్తోందని పేర్కోంది.  

కరోనా వైరస్‌ మరణాలను అడ్డుకోవడంలో బీసీజీ వ్యాక్సిన్‌‌ కీలకంగా మారిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. బీసీజీ వ్యాక్సిన్‌‌ కొనసాగుతున్న దేశాల్లో మరణాల శాతం తక్కువగా ఉందన్నారు. అమెరికాకు చెందిన అలర్జీ, సంక్రమణ రోగాల సంస్థ చేసిన ఓ అధ్యయనంలో ఈ ఆసక్తికర అంశాలు కనిపించాయి. అమెరికాలోని న్యూయార్క్‌, ఇల్లినాయిస్‌, లూసియానా, ఫ్లోరిడాతో పోలిస్తే బ్రెజిల్ లోని పెర్నాంబుకో, రియోడి జనీరో, సావో పాలో, మెక్సికోలోని మెక్సికో నగరంలో మరణాల రేటు చాలా తక్కువగా నమోదు కావడం శాస్త్రవేత్తల దృష్టిని సారించేందుకు కారణంగా మారింది. దీంతో అధ్యయనం ప్రారంభించిన శాస్త్రవేత్తలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అమెరికా కన్నా అధికంగా జనబా సాంధ్రత కలిగిన లాటిన్‌ అమెరికా మరణాలు తక్కువగా నమోదు కావడంతో మరి అధ్యయనానికి మరింత బలం చేకూర్చింది.

ఇక అటు యూరోప్ లోని జర్మనీలోనూ ఫలితాలు ఆశ్చర్యజనకంగా ఉన్నాయి. తూర్పుప్రాంతం కన్నా జర్మనీలోని పశ్చిమంలో కరోనా మరణాల 2.9 శాతం ఎక్కువ. మరణాల రేటు తక్కువగా ఉన్న దేశాల్లో వయసు, ఆదాయం, ఆరోగ్య సదుపాయాల పరంగా తేడాలు ఉన్నప్పటికీ అన్నింటిలోనూ ఉన్న ఉమ్మడి కారకం టీబీ వ్యాక్సినేషన్‌. ప్రస్తుతం బీసీజీ వాక్సినేషన్ కొనసాగుతున్న ప్రాంతంల్లో మరణాల శాతం తక్కువగా నమోదయ్యిందని అధ్యయం చేసిన కరోలినా బరిల్లాస్ పేర్కోన్నారు. అందుకు జర్మనీ సాక్ష్యంగా నిలుస్తోంది. తూర్పు, పశ్చిమ జర్మనీలు 1990లో ఏకమయ్యాయి. పశ్చిమతో పోలిస్తే తూర్పు జర్మనీలో పదేళ్లు ముందుగానే టీబీ వ్యాక్సినేషన్‌ జరిగింది. దాంతో పశ్చిమ జర్మనీలో వృద్ధులకు కరోనాతో ఎక్కువ ముప్పు కనిపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఏదైనా ఒక ప్రాంతంలో 10శాతం టీబీ వ్యాక్సినేషన్‌ కవరేజ్‌ ఉంటే కొవిడ్‌ మరణాల్లో అక్కడ 10శాతం తగ్గుదల కనిపిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. మొత్తానికి బీసీజీ ఒక ఆశాజనకంగా కనిపిస్తోంది!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Albert Calmette  Camille Guerin  Tuberculosis vaccine  BCG  Germany  coronavirus  Covid 19  Corona India  

Other Articles