Covid-19 vaccine trial yields positive results హ్యూమన్ ట్రయల్స్ లో కరోనా వాక్సీన్ పాజిటివ్ రిజల్ట్

Biontech and pfizers covid 19 vaccine trial yields positive results

coronavirus vaccine, corona vaccine, covid vaccine, covid-19 vaccine, germany corona vaccine, germany vaccine positive results, BioNtech vaccine positive results, Pfizer corona vaccine human trails, bioNtech vaccine trails positive, European company vaccine, german vaccine positive results, immune defences

A coronavirus vaccine from Germany's BioNTech has yielded positive trial results, generating immune defences in participants that were stronger than those of the average recovered Covid-19 patient, according to preliminary data released by the company.

కరోనా వాక్సీన్ ముందడుగు: హ్యూమన్ ట్రయల్స్ లో పాజిటివ్ రిజల్ట్

Posted: 07/02/2020 09:41 PM IST
Biontech and pfizers covid 19 vaccine trial yields positive results

క‌రోనా మ‌హ‌మ్మారి కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలకు చెందిన పలు ఫార్మా కంపెనీలు గత నాలుగు మాసాలుగా వ్యాక్సిన్ అభివృద్ధికి నిర్విరామ కృషి చేస్తున్నాయి. భారత్ కు చెందిన భారత్ బయోటెక్ ఫార్మ సంస్థ కూడా కోవాక్సీన్ పేరుతో ఒక మందును తీసుకువచ్చింది. దానికి ఇటీవలే భారత డగ్ర్ కంట్రోల్ అధికారిత సంస్థ హ్యూమన్ ట్రయల్స్ కు అనుమతి కూడా మంజూరు చేసింది. అయితే తొలిదశ హ్యూమన్ ట్రయల్స్ లోనూ సత్పాలితాలను రాబడుతోంది మరో వాక్సీన్. తాజాగా జ‌ర్మ‌నీకి చెందిన బ‌యోఎన్ టెక్ తోపాటు అమెరికా ఫార్మా దిగ్గ‌జాల్లో ఒక‌టైన ఫైజ‌ర్ సంయుక్తంగా రూపొందించిన టీకా మెరుగైన ఫ‌లితాలు ఇస్తున్న‌ట్లు ఆ కంపెనీలు వెల్ల‌డించాయి. మాన‌వుల్లో జ‌రిపిన‌ తొలిద‌శ ప్ర‌యోగాల్లో వైర‌స్ ను త‌ట్టుకునే సామర్థ్యాన్ని గుర్తించిన‌ట్లు ఆ కంపెనీలు ప్ర‌క‌టించాయి.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే కోటిమందిపైగా ప్రజలు కరోనా మ‌హ‌మ్మారి ప్రభావానికి గురికాగా, వారిలో ఇప్ప‌టివ‌రకు 5ల‌క్ష‌ల 15వేల మంది ప్రాణాలను కరోనా కబళించింది. ఈ మ‌హ‌మ్మారి ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపకుండా వుండేందుకు ఇప్ప‌టికే 17కంపెనీలు వ్యాక్సిన్ రూప‌క‌ల్ప‌న‌లో భాగంగా మాన‌వ ప్రయోగ ద‌శ‌కు చేరుకున్నాయి. తాజాగా యూరోపిన్ దేశానేకి చెందిన దిగ్గజ ఫార్మ కంపెనీ బ‌యో ఎన్‌ టెక్‌, అగ్రరాజ్యం ఫార్మ కంపెనీ ఫైజ‌ర్ తో అభివృద్ధి చేసిన టీకా కూడా మెరుగైన ఫ‌లితాలు ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించాయి. దీంతో ఇప్ప‌టికే మాన‌వ ప్ర‌యోగాల్లో ముందున్న ఆక్స్‌ఫర్డ్‌, మోడెర్నా, కాన్సినో బ‌యోలాజిక్స్‌, ఇనోవియా ఫార్మాల స‌ర‌స‌న తాజాగా ఈ కంపెనీలు చేరాయి.

బ‌య ఎన్ టెక్‌ కంపెనీ బిఎన్టీ162బి1 (BNT162b1) పేరుతో రూపొందించిన వ్యాక్సిన్ ను 24మంది వాలంటీర్ల‌పై రెండు డోసుల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. 28 రోజుల అనంత‌రం వైర‌స్ సోకిన వారికంటే వీరిలో అధికంగా క‌రోనా వైర‌స్ ను ఎదుర్కొనే యాంటీ బాడీస్ అభివృద్ధి చెందినట్లు తేలింద‌ని కంపెనీ స్ప‌ష్టం చేసింది. ఈ వ్యాక్సిన్ శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని గ‌ణ‌నీయంగా పెంచుతున్న‌ట్లు తొలిదశ ప్ర‌యోగంలో నిరూపిత‌మైన‌ట్లు బ‌యోఎన్ టెక్ కంపెనీ తెలిపింది. అయితే, వైర‌స్ సంక్ర‌మ‌ణ నుంచి కాపాడుతుంద‌నే విష‌యాన్ని తెలుసుకునేందుకు‌ భారీ ప్ర‌యోగానికి సిద్ధ‌మ‌వుతున్నామ‌ని వెల్ల‌డించారు. ఈ ప్ర‌యోగంలో న‌లుగురికి మూడు వారాల్లో రెండు ఇంజెక్ష‌న్లు చేయ‌గా, వీరిలో ముగ్గురికి స్వ‌ల్ప జ్వ‌రం మాత్రమే వ‌చ్చిన‌ట్లు గుర్తించామ‌ని బ‌యో ఎన్ టెక్‌ తెలిపింది. ఇంజెక్ష‌న్ నొప్పి కార‌ణంగా మూడో డోస్ ను మ‌రో బృందంపై ప‌రీక్షించామ‌ని పేర్కొంది. ఏప్రిల్‌, మే నెల‌లో జ‌రిపిన ప్ర‌యోగాల ఫ‌లితాల‌తోపాటు మ‌రో మూడుర‌కాల వ్యాక్సిన్ వివ‌రాల‌ను తొంద‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని బ‌యోఎన్‌టెక్ సంస్థ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : corona vaccine  covid 10 vaccines  germany  Amercia  European company  human trails  BioNtech  Pfizer  vaccines  

Other Articles