విపత్తులు, అత్యయిక పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పింఛన్లలో కోత విధించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఆర్డినెన్స్ పై తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది, మార్చిలో దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల్లో కోతతో పాటు మాజీ ఉద్యోగుల పెన్షన్ లలోనూ కోతలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సుకు గవర్నర్ ఆమోదముద్ర కూడా లభించింది. దీంతో తెలంగాణ విపత్తులు, ప్రజారోగ్య అత్యయిక ఆర్డినెన్స్ 2020కి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. ఇది ఈ నెల 18న అమోదం పోందినా.. మార్చి 24 నుంచి అమల్లోకి వచ్చినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
కరోనా కష్టకాలంలో ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సు ఆరు నెలల పాటు అమల్లో వుండనుండటంతో దీనిని రిటైర్డ్ డిఎఫ్ఓ రామన్ గౌడ్ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేస్తూ.. ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ వ్యతిరేకంగా వుందని పేర్కోన్నారు. పెన్షనర్లకు పూర్తి పెన్షన్ ను చెల్లించాలంటూ ఆయన తాను దాఖలైన వ్యాజ్యంలో పేర్కోన్నారు. న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తూ ఈ ఆర్డీనెన్సును ఏ ప్రాతిపదికన తీసుకువచ్చారని ఆయన ప్రశ్నించారు. రామన్ గౌడ్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఆర్డినెన్సుపై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
రిటైర్డు డిఎప్ఓ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం పింఛన్లలో కోత ఏ చట్టం ప్రకారం విధిస్తున్నారంటూ న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగాల వేతనాల్లో కోత విధించిన క్రమంలో ఈ ఆర్డీనెన్సును ప్రభుత్వం తీసుకువచ్చింది. కాగా, పెన్షనర్లకు విధించి కోత మొత్తాన్ని ఆర్నెల్లలో తిరిగి చెల్లించాలని న్యాయస్థానం ఇదివరకే పేర్కొంది. పెన్షనర్లకు పూర్తి పింఛను చెల్లించాలంటూ హైకోర్టులో వ్యాజ్యం నడుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more