Roll back fuel price hike: Sonia Gandhi సంక్షోభంలో ప్రజలకు ఫలాలు ఇవ్వండీ: ప్రధానికి సోనియా లేఖ

Roll back fuel price hike pass benefits to people sonia gandhi

sonia gandhi, indian national congress, congress president, narendra modi, prime minister narendra modi, india lockdown, coronavirus pandemic, fuel price hike, petrol, diesel, Sonia Gandhi, PM Modi, deep distress, fuel prices, covid-19, coronavirus, oil companies, profiteering people, national, politics

Congress president Sonia Gandhi wrote a letter to Prime Minister Narendra Modi, expressing 'deep distress' over the recent increase in fuel prices and urged the government to roll back the hikes and pass on the benefit to common people.

సంక్షోభంలో ప్రజలకు ఫలాలు ఇవ్వండీ: ప్రధానికి సోనియా లేఖ

Posted: 06/16/2020 07:56 PM IST
Roll back fuel price hike pass benefits to people sonia gandhi

లాక్ డౌన్ సమయంలో ఎలాంటి ధరల కుదుపులు లేని ఇంధన ధరలు.. అన్ లాక్ 1.0 అమల్లోకి వచ్చిన వెంటనే దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఒక్కసారిగా పెరగడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. పదిరోజుల నుంచి వరుసగా ప్రతీ రోజు పెరుగుతున్న ఇంధన ధరలను వెంటనే ఉపసంహరించాలని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ డిమాండ్ చేశారు. ఇంధన ధరల పెంపుపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆమె పెట్రో ధరలను వెంటనే తగ్గించి సామాన్యులకు అంతర్జాతీయంగా అందే లబ్దిని అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ప్రధాని నరేంద్రమోడీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో సమావేశం నిర్వహిస్తున్న రోజునే లేఖ రాశారు.

అంతర్జాతీయంగా ప్రస్తుతం చరిత్రలో మునుపెన్నడూ లేనంత తక్కువ ధరలో క్రూడ్ అయిల్ ధర పలుకుతుండగా, ఆ లబ్దిని ప్రజలకు అందించకుండా కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీలను ఇబ్బడిముబ్బడిగా విధిస్తోందని మండిపడ్డారు. కరోనా కష్టాలలో వున్న వాహనదారులకు ఇంధన ధర లాభాలను అందకుండా మధ్యలోనే అటు ప్రభుత్వం, ఇటు ఇంధన సంస్థలు, వీటితో పాటు రాష్ట్రాలు తన్నకుపోవడం అసమంజసంగా పేర్కోన్నారు9. కరోనాతో కష్టకాలాన్ని వెల్లదీస్తున్న వాహనదారులకు లాభాలను అందించకుండా క్రమంగా పెంచడం పూర్తిగా అవివేకం, అనాలోచిత చర్య అని సోనియాగాంధీ విమర్శించారు.

సంక్షోభ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులపై ఈ భారం మోపడం సరికాదని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రజలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకోవడం కేవలం ప్రధాని నరేంద్రమోడీకి మాత్రమే సాధ్యమవుతుందని ఎద్దేవా చేశారు. కష్టకాలంలో వున్న ప్రజలకు భరోసా కల్పించేందుకు వారి ఖాతాల్లోకి డబ్బులు వేయాలని డిమాండ్ చేశారు. అవే ఈ కష్టకాలంలో వారికి అసరా అవుతాయని అన్నారు. ఇక ప్రభుత్వం ఈ పరిస్థితుల్లోనూ ప్రజల నుంచి లాభాన్ని ఆర్జించాలని అనుకోవడం మూర్ఖత్వమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఇంధర ధరల పెంపుపై మండిపడ్డారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలోని అత్యంత సంపన్నులకు చేకూర్చేు లబ్ది కోసం సామాన్య వాహనదారులపై ఇంధన భారం మోపుతుందని దుయ్యబట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles