Tirupati Balaji temple reopens after 80 days తెరుచుకున్న ఆలయ మహాద్వారలు.. భక్తులకు అనుమతి..

Worshippers in masks return to religious places as india reopens

coronavirus, covid-19, Tirupati Balaji temple, Tirupati Balaji temple open, Venkateswara temple, Tirumala temple, tirumala tirupati devasthanam committee, TTD. TTD Employees, mask mandatory for balaji darshan, social distancing darshan, andhra pradesh, politics

After nearly 80 days, India's famous Sri Venkateswara temple atop the Tirumala hills here reopened on Monday with new health norms in place to check the spread of coronavirus. The famous shrine was reopened for 'darshan' at 6 am and end at 7:30 am, though with the entry was restricted to Tirumala Tirupati Devasthanam (TTD) employees and their family members

తెరుచుకున్న ఆలయ మహాద్వారలు.. భక్తులకు అనుమతి..

Posted: 06/08/2020 08:47 PM IST
Worshippers in masks return to religious places as india reopens

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్ డౌన్ ఆంక్షల నుంచి తొలిసారిగా దేశంలోని జనజీవనం ప్రారంభమైంది ఈ క్రమంలో దేశంలోని పలు మతాల ప్రార్థనా మందిరాలు కూడా తెరుచుకున్నాయి. గత రెండున్నర నెలలుగా దేవాలయాలకు ఎప్పుడు అనుమతిస్తారా.? అంటూ వేచిచూసిన భక్తుల ఎదురుచూపులకు ఇవాళ తెరపడింది. దేశంలో ఐదవ విడత లాక్ డౌన్ లో భాగంగా కేంద్రం అమల్లోకి తీసుకువచ్చిన పలు సడలింపులతో ఇవాళ్టి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు తెరుచుకున్నాయి. ప్రపంచంలోనే ప్రసిద్దిగాంచిన కలియుగ వైకుంఠంగా కీర్తినందుకుని బాసిల్లుతు్న తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు ఏడుకొండలవాడిని.. ప్రత్యక్షదైవమన శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల శ్రీవారిఆలయం సుమారు 80 రోజుల తర్వాత తెరుచుకుంది. ముందునుంచి తీరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చెబుతూవస్తున్నట్లుగానే ఇవాళ కేవలం టీటీడీ ఉద్యోగులకు మాత్రమే శ్రీవారి తొతొలిదర్శనానికి అనుమతించింది. ఇక రేపు ఉదయం కూడా టీటీడీ దేవాలయ సిబ్బందికి. వారి కుటుంబసభ్యులకు మాత్రమే దర్శనాన్ని కల్పంచనున్నారు. అయితే ఈ నెల 11 నుంచి భక్తులందరికీ దర్శన భాగ్య అవకాశం కల్పిస్తారు. గంటలకు ఐదు వందల మందికి మాత్రమే దర్శనాన్ని పరిమితం చేయనుంది టీటీడీ. దీంత ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మాత్రమే భక్తులకు శ్రీవారిని దర్శంచుకునే బాగ్యం కలిగింది, దీంతో రోజుకు 6 వేల మంది దర్శించుకునేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ.

భక్తుడికి భక్తుడికీ మధ్య బౌతిక దూరం నిబంధనలతో పాటు తప్పనిసరిగా మాస్కు ధరించాలన్న నిబంధనలు వున్నాయి. శ్రీవారి దర్శనానికి క్యూలైన్లలో వేచివుండే భక్తులు ఏం చేయాలో.. ఏమి చేయకూ డదో ఎప్పటికప్పుడు టీటీడీ దేవాలయ బోర్డు మైకుల ద్వారా సూచిస్తూనే వున్నారు. ఇవాళ రెండున్నర గంటల సమయంలో శ్రీవారిని 1200 మంది భక్తులు దర్శించుకున్నారని  సమాచారం, ఇక ఈ నెల 11 నుంచి విఐపీ దర్శనాలతో పాటు బ్రేక్ దర్శనాలు కూడా వుంటాయని చెప్పారు. ఇక శ్రీవారి దర్శనం కోసం కొండపైకి వచ్చే భక్తులకు అలిపిరి వద్దే ధర్మల్ స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని టీటీడీ అధికారులు చెప్పారు. ఇక శ్రీవారి దర్శనానికి పదేళ్ల లోపు వయస్సు చిన్నారులతో పాటు.. 65 ఏళ్లు దాటిన పెద్దలను అనుమతించడం లేదని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles