4 doses of HCQ reduce risk of coronavirus: Study హెచ్సీక్యూ డ్రగ్ పై ఐసీఎంఆర్ తాజా అధ్యయన వివరాలివిగో..

4 or more hydroxychloroquine doses reduced risk of coronavirus study

coronavirus, covid-19, hydroxychloroquine, indian council of medical research, world health organisation, doctors, health workers, Research

A sustained intake of anti-malarial drug hydroxychloroquine (HCQ) has shown positive results in reducing the risk of coronavirus in the healthcare workers, the ICMR study says. coronavirus, covid-19, hydroxychloroquine, reserchers, indian council of medical research, scientist, world health organisation, doctors, health workers, HCQ healthcare workers hyrdoxychloroquine intake, ICMR

హెచ్సీక్యూ డ్రగ్ పై ఐసీఎంఆర్ తాజా అధ్యయన వివరాలివిగో..

Posted: 06/01/2020 05:43 PM IST
4 or more hydroxychloroquine doses reduced risk of coronavirus study

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో దానిని నివారించిందేందుకు వైద్యులు రక్షణ పరికరాలతో పాటు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మందును కూడా తీసుకుంటున్నారన్న విషయం తెలిసిందే. ఈ మందును అధికంగా ఉత్పత్తి చేసి నిల్వ చేసిన ఘనత మాత్రం భారత్ దేశానిదే. కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తున్న క్రమంలో పలు దేశాలకు మందును ఎగుమతి చేసి ఆదుకున్నది కూడా భారత్ కావడం గమనార్హం. ఇక ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తమకు హెచ్సీక్యూ మందును ఎగుమతి చేయాలని కూడా అడిగిన విషయం తెలిసిందే. ఇక తాను ఈ మందును తీసుకున్నానని ఆయన స్వయంగా ప్రకటించారు.

ఇంతవరకు బాగానే వున్నా.. డోనాల్డ్ ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజునే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మందు విషయంలో్ ఓ సూచన చేసింది. హెచ్సీక్యూ మందును తీసుకోవడం ప్రమాదకరమని సూచించింది. అయితే యాంటి మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్వీన్ తీసుకోవడం వల్ల కరోనా వైరస్ సో్కే ముప్పు అవకాశాలు తక్కువగా వుంటాయని మరోమారు భారత్ వైద్య పరిశోధన కౌన్సిల్ ఐసీఎంఆర్ పునరుద్ఘాటించింది. దీనిని తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్సను అందిస్తున్న వైద్యులు వాడుతున్నారని, ఈ మందు వల్లే వారికి కరోనా సోకకుండా నివారించగలిగామని చెప్పింది.

ఈ మేరకు ఐసీఎంఆర్ తమ ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ లో పరిశోధనా పలితాలను వెల్లడించింది. తమ అథ్యయనంలో హెచ్సీక్యూ ఎంత మోతాదులో తీసుకుంటూ వైరస్ సంక్రమించే అవకాశం అన్న వివరాలను కూడా గమనించాలని వెల్లడించింది. ఔషదం తీసుకోవడంతో పాటు వ్యక్తిగత రక్షణ కిట్లను కూడా తప్పక వాడాల్సిందేనని ఐసీఎంఆర్ సూచించింది. వైరస్‌ బారిన పడకుండా మాత్రమే హెచ్‌సీక్యూ ఆపగలదని తెలిపారు. కానీ, వైరస్‌ ముందే శరీరంలోకి వెళ్లి పరిస్థితి తీవ్ర స్థాయిలో ఉన్నవారిపై ఈ ఔషధం పెద్దగా ప్రభావం చూపదని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19  hydroxychloroquine  world health organisation  doctors  

Other Articles