Model Shehnaaz Gill's father booked on rape charge మహిళను గన్ తో బెదిరించి.. బాలీవుడ్ నటి తండ్రి

Actor shehnaaz gill s father booked for raping woman at gunpoint

Big Boss, Shehnaz Gill, Jalandhar, Punjab, rape, gunpoint, Santokh Singh, Jalandhar-based woman,

Big Boss 13 contestant Shehnaaz Gill’s father has been booked for allegedly raping a 40-year-old woman at gunpoint, police said on Thursday. He is absconding. The accused, Santokh Singh, 45 allegedly raped the Jalandhar-based woman on May 14, but she lodged a complaint on May 19.

బాలీవుడ్ నటి తండ్రిపై అత్యాచారం కేసు.. మహిళను గన్ తో బెదిరించి..

Posted: 05/22/2020 10:01 AM IST
Actor shehnaaz gill s father booked for raping woman at gunpoint

బాలీవుడ్ నటి, సింగర్, బిగ్ బాస్ 13 కంటెస్టెంట్, మోడల్ షెహనాజ్ గిల్ తండ్రి సంతోఖ్ సింగ్ రేప్ కేసులో ఇరుక్కున్నాడు. తన కూతురులాంటి వయస్సున్న అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 20 ఏళ్ల అమ్మాయిని తుపాకీతో బెదిరించి అత్యాచారం చేశాడు. దాదాపు పది రోజుల ముందు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ అత్యాచార ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. కాగా, పోలీసులు కేసు నమోదు చేశారన్న సమాచారంతో అత్యాచార అభియోగాలు ఎదుర్కోంటున్న నిందితుడు పరారీలో వున్నాడు.

మే 14వ తేదీన ఈ దారుణం జరిగినప్పటికీ... ఫిర్యాదు చేసేందుకు బాధితురాలి కుటుంబం భయపడింది. అయితే ఓ సామాజిక కార్యకర్త వారికి ధైర్యం చెప్పి.. అండగా వుంటానని చెప్పడంతో వారు ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.... మే 14న స్నేహితురాలితో కలసి మరో స్నేహితుడు సిద్ధూను కలవడానికి బాధితురాలు బియాస్ గ్రామానికి వెళ్లింది.

సాయంత్రం 5.30 గంటలకు వారు బియాస్ కు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన సంతోఖ్ సింగ్ తుపాకీ గురిపెట్టి ఆమెను కారులోకి తోశాడు. చంపుతానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్ష్యాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. కాగా నిందితుడు పరారీలో వున్నాడని సమాచారం. ఇదిలావుండగా నిందితుడి తరపు వర్గాలు మాత్రం తమ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్న వాదనలు తెరపైకి తెస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Big Boss  Shehnaz Gill  Jalandhar  Punjab  rape  gunpoint  Santokh Singh  Jalandhar-based woman  

Other Articles

Today on Telugu Wishesh