Chidambaram slams government's approach towards poor బీద, పేదలకు నగదు సాయంలో అలసత్వం వద్దు: కాంగ్రెస్

Chidambaram slams modi government s approach towards poor during lockdown

coronavirus in india, coronavirus, covid-19, corona spread, CM KCR, Congress, TRS, UttamKumar Reddy, Komati Reddy Venkat Reddy, salaried cut, Employees cut, excess income state, Telangana, daily labour, chief secretaries all states, coronavirus, coronavirus lockdown 21, courts, covid19, justice nv ramana, justice ravindra bhat, migrant workers, supreme court, coronavirus updates, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus live update india, coronavirus in india new delhi, dialy labour, coronavirus in india latest news

Senior Congress leader P Chidambaram on Wednesday called for providing immediate cash to the poor, while accusing the government of adopting a miserly and negligent approach towards the deprived during the lockdown.

లాక్ డౌన్ కొనసాగింపుకు సై.. నగదు సాయంలో అలసత్వం వద్దు: చిదంబరం

Posted: 04/08/2020 07:42 PM IST
Chidambaram slams modi government s approach towards poor during lockdown

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ కు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని కే్ంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. అయితే ఇంతటి విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అరోపించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుననే అన్ని చర్యలకు తమ పార్టీ తరపున మద్దతు ఇస్తున్నామని.. కానీ ప్రభుత్వం మాత్రం పలు అంశాల్లో ప్రకటనలు చేసి చేతులెత్తేస్తోందని అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు చేస్తామన్న నగదు బదిలి పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇక మారోటియం పేరు చెప్పి మూడు నెలల మారటోరియం విధిస్తామని ప్రకటనలు చేసిన ప్రభుత్వం.. మారటోరియంపై వడ్డీలను మాత్రం విస్మరించిందని చెప్పారు. వీటి విషయమూ తాము ప్రశ్నిస్తే.. ఈ సమయంలో రాజకీయాలు చేస్తున్నామని తెలివిగా తప్పించుకుంటున్నారని అన్నారు. ‘‘ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లాక్‌డౌన్‌ సమయంలో నిరుద్యోగం 23 శాతానికి పెరిగింది. రోజూవారీ వేతన శ్రామికుల జీవితం స్తంభించిపోయింది. వారు ఎన్నో ఇక్కట్లకు గురౌతున్నారని ఆయన అన్నారు. ఈ విషయమై ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఇందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి హామీ ఇచ్చిన ప్రకారం పేద శ్రామికులకు ఆర్థికసాయాన్ని అందచేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్‌ 14 తర్వాత లాక్ డౌన్‌ ఎత్తివేయాలనే అంశం చర్చకు వచ్చినప్పుడు కొనసాగింపును సమర్థించిన వారిలో తానే తొలివాడినని చిదంబరం అన్నారు. లాక్ డౌన్‌ నిర్ణయం సరైనదేని... కాకుంటే పేద ప్రజలకు నగదు పంపిణీ చేయడంలో ప్రభుత్వం అలసత్వం వహస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర, పేద, మధ్యతరగతి ప్రజల పక్షాన నిలబడి అలోచించాలని, అలాగే నిరుద్యోగ సమస్యను కూడా కట్టడి చేయాలని చిదంబరం కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19  PM Modi  Lockdown  Congress  Chidambaram  BJP  Unemployment  direct cash trasfer  National  Politics  

Other Articles