రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో కలకలం రేపిన మహిళ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. గత నెల 17న లభ్యమైన వివాహిత మృతదేహానికి సంబంధించిన కేసు విచారణలో పలు విస్తుపోయే విషయాలు తెలుసుకున్నారు పోలీసులు. ఇద్దరు యువకులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో పథకం ప్రకారమే ఆమెను హత్యచేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఈ కేసులో మృతురాలిని వివాహితగా గుర్తించిన పోలీసలు.. వివాహేతర సంబంధం, ఆర్థిక గొడవలే హత్యకు కారణమని భావించారు. ఈ కోణంలోనే దర్యాప్తు సాగించారు. హత్యకు గురైన మహిళకు వివాహమైంది. అయితే, పెళ్లికి ముందు నుంచే ప్రధాన నిందితుడితో ఆమె ప్రేమలో ఉంది. పెళ్లి తర్వాత కూడా వారి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగాయి. ఈ క్రమంలో పెళ్లి చేసుకుని దూరంగా వెళ్లిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని ఆమె పదేపదే ఒత్తిడి చేసింది. అయితే, ఇదే సమయంలో వేరే అమ్మాయికి దగ్గరైన నిందితుడు వివాహితను దూరం పెట్టాడు. అయినప్పటికీ ఆమె నుంచి ఒత్తిడి ఆగకపోవడంతో హత్య చేసి వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు.
ప్రణాళిక అమలులో భాగంగా లాంగ్‌డ్రైవ్‌కు వెళ్దామని బాధితురాలిని నమ్మించి అద్దె కారులో ఎక్కించుకున్నాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత పోలీసుల అదుపులో ఉన్న నిందితుడితో కలిసి కారులోనే అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తంగడపల్లి వంతెన వద్దకు చేరుకుని మృతదేహంపై ఉన్న దుస్తులు తొలగించి కిందికి తీసుకొచ్చారు. ఎవరూ ఆమెను గుర్తుపట్టకుండా బండరాయితో ముఖాన్ని ఛిద్రం చేశారు. అనంతరం గంటపాటు అక్కడే ఉన్న నిందితులు బండరాయిని తమతోపాటు తీసుకెళ్లారు.
ఎన్కేపల్లి, ప్రగతి రిసార్ట్స్, ప్రొద్దుటూరు మీదుగా నార్సింగి ఇంటర్ చేంజ్ నుంచి ఔటర్ రింగురోడ్డు మీదికి చేరుకున్నారు. ఈ కేసులో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రొద్దుటూరు వద్ద లభించిన సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో కారు జీపీఎస్ కీలకంగా మారింది. పరారీలో ఉన్న అసలు నిందితుడు దొరికితే కేసు చిక్కుముడి పూర్తిగా వీడనుంది. ఈ కేసులో ఓ నిందితుడు పోలీసులకు దొరికినా.. ప్రధాన నిందితుడ్ని పట్టుకోవడంలో పోలీసులకు పలు అవరోధాలు ఏర్పడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Mar 06 | ఉత్తమ సర్పంచ్‌గా అవార్డు తీసుకున్న వ్యక్తి రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఏసీబీ కథనం ప్రకారం.. జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ... Read more
Mar 06 | సొంత పార్టీ తీసుకునే నిర్ణయాలను కూడా విమర్శించే బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరలపై తనదైన శైలిలో విసిరిన పంచ్ బీజేపి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఒక విధంగా వరుసగా ఆరు రోజుల... Read more
Mar 06 | ఝార్ఖండ్‌లో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిని బంధించిన 60 మంది దుండగులు నెలరోజులగా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. మాదకద్రవ్యాలను ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ తనపై నిత్యం అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.... Read more
Mar 06 | యావత్ ప్రపంచ దేశాల అర్థిక పరిస్థితులను కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసిన నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు గత ఏడాది జూన్ లో ఏర్పడిన అన్ లాక్ నుంచి ప్రతీ అంశంలో ధరాఘాతాన్ని ప్రజలు... Read more
Mar 05 | యావత్ ప్రపంచాన్ని కాకవికళం చేసిన కరోనా మహమ్మారి 2019 చివర్లో చైనాలో ఉనికి చాటుకుని.. అక్కడ్నించి ఖండాంతరాలకు ప్రయాణించి ప్రపంచ దేశాలన్నింటినీ అతలాకుతలం చేసింది. ప్రస్తుతం వ్యాక్సిన్ రావడం అందరికీ ఊరట అని చెప్పాలి.... Read more