భారత దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ పిలుపుమేరకు భారీ స్పందనే వచ్చింది. కరోనాను తరిమికొట్టడంలో మనమంతా ఒక్కటిగా ఉన్నామనే దానికి నిదర్శనంగా అందరూ ఇళ్లలో లైట్లు ఆర్పి బాల్కనీల్లో నిలబడి దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. దీనిపై అనూహ్య స్పందన వచ్చింది. దేశప్రజలంతా ఒక్కటిగా మారి తాము ఐక్యంగా కరోనా రక్కసితో పోరాడేందుకు సిద్దమని చాటిచెప్పారు. పలువురు దీపాలను వెలిగించి ఆ తరువాత చప్పట్లనుకూడా కొట్టారు. అయితే దీపాల కాంతిని చూసిన అత్యుత్సాహంలో ఓ బీజేపి మహిళా నాయకురాలు ఏకంగా ఓ వింత కార్యానికి శ్రీకారం చుట్టారు.
దెవ్వలెలను వెలగించడంతో పాటు భిన్నంగా ఆలోచించిన ఉత్తరప్రదేశ్ బీజేపీ లీడర్ మంజూ తివారీ.. మరో అడుగు ముందుకేసీ తుపాకీ కాల్చారు. ఈమె చూపించిన అత్యుత్సాహానికి ఉత్తరప్రదేశ్ పోలీస్ ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమె చేసిన తప్పును ఆమే #9pm9minute అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియా పోస్టు చేసుకుని బుక్కయింది. ఆమె గాల్లోకి కాల్పులు జరుపుతుంటే సపోర్ట్ చేస్తూ భర్తే వీడియో తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. 'దీపాలు వెలిగించాం. ఇప్పుడు కరోనాను తరుముతున్నాం' అంటూ కామెంట్ కూడా రాశారు.
कानून तोड़ने में सबसे ज्यादा आगे भाजपा नेता ही रहते हैं। कल पीएम की अपील थी दिया जलाने की लेकिन देखिए कैसे भाजपा नेता व बलरामपुर भाजपा महिला मोर्चा की अध्यक्ष ने खुलेआम प्रदर्शन के लिए फायरिंग की और वीडियो फेसबुक पर डाला।
— UP Congress (@INCUttarPradesh) April 6, 2020
योगी आदित्यनाथ इस पर कार्यवाही करेंगे क्या? pic.twitter.com/W9IioUsYXh
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more