coronavirus package: Cash transfer, free LPG, grains రూ. లక్షా 70 వేల కోట్లతో కేంద్రం కరోనా ప్యాకేజీ

Coronavirus fm sitharaman announces package worth rs 1 70 000 crore for poor

corornavirus, covid -19, income tax, Last date for filing ITR, interest rate, FM Nirmala Sitharaman, financial year 2018-19, nirmala sitharaman press conference live, nirmala sitharaman press conference today live, sitharaman announcement, nirmala sitharaman press conference, nirmala sitharaman announcement, nirmala sitharaman press conference, nirmala sitharaman press conference today, finance minister nirmala sitharaman, nirmala sitharaman announcement today, fm sitharaman press conference, nirmala sitharaman live today, nirmala sitharaman address, fm press conference today, fm nirmala sitharaman press conference today coronavirus news, coronavirus hyderabad, coronavirus in tamil nadu, coronavirus cases, coronavirus live update india, coronavirus in india, coronavirus in india latest news

Finance Minister Nirmana Sitharaman announced a relief package worth Rs 1.70 lakh crore to help the nation's poor tackle the financial difficulties arising from Covid-19 outbreak. Sitharaman said the economic relief package will focus primarily on migrant labourers and daily wage labourers.

కరోనా కోసం కేంద్రం ప్యాకేజీ: రూ. లక్షా 70 వేల కోట్లు.. నేరుగా అకౌంట్లకు

Posted: 03/26/2020 03:34 PM IST
Coronavirus fm sitharaman announces package worth rs 1 70 000 crore for poor

కరోనా వైరస్ నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితి అతలాకులం కాకుండా ఆర్థిక ప్యాకేజీని త్వరలో కేంద్రం ప్రకటించనుందని, ఇదివరకే ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్.. ఇవాళ ఉద్దీపన పథకాలను వెలువరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకే లాక్ డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఐటీ రిటార్ను, జీఎస్టీ, లేట్ ఫీజు తదితర అంశాలపై ఇప్పటికే ఆఖరు తేదీని మార్చి 31 నుంచి జూన్ 30కి మర్చిన కేంద్రం.. లేట్ ఫీజుల రుసుమును కూడా 12 నుంచి 9 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. వీటితో పాటు ఆధార్‌-పాన్‌ అనుసంధానం, ‘వివాద్ సే విశ్వాస్‌’ పథకం గడువును జూన్‌ 30 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

ఇక ఇవాళ మీడియా సమావేశంలో ఉద్దీపన ఫ్యాకేజీ కింద కేంద్రప్రభుత్వం లక్షా 70 వేల కోట్ల రూపాయల ఫ్యాకేజీ వివరాలను నిర్మలా సీతారామన్ తెలిపారు. కరోనా కోరల్లో చిక్కున్న భారత్ ఆర్థిక రంగానికి ఊతం ఇచ్చేలా ప్రకటన చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు. అలాగే జన్ ధాన్ ఖాతాల్లోకి డబ్బులు నేరుగా జమ చేస్తామని వెల్లడించారు. లక్షా 70వేల కోట్ల ప్యాకేజీ రెడీ చేయగా.. ఎకనామిక్ రిలీఫ్ ప్యాకేజీలో భాగంగా.. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించవద్దని.. అలాగే ఎవరి చేతిలోనూ డబ్బు లేని పరిస్థితి ఉండవద్దని ప్రభుత్వం భావిస్తోందని ఆమె అన్నారు.

వైద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందికి  50లక్షల ఇన్సూరెన్స్ కవర్ చేస్తున్నట్లు నిర్మలా సీతారమన్ ప్రకటించారు. ఆశావర్కర్లకు కూడా ఇన్సూరెన్స్ కవర్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వచ్చే మూడు నెలల పాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో ఆర్థిక ప్యాకేజ్ అందజేయనున్నారు. 80కోట్ల మంది ప్రజలకు నెలకు 5కేజీల బియ్యం.. ఇప్పుడు ఇస్తున్నదానికి అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బియ్యం బదులు గోదుమలు కావాలంటే కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక కేజీ కంది పప్పు కూడా ఇస్తామని ప్రకటించారు.

అందులో భాగంగానే ఈ ప్యాకేజీతో పేదల ఆకలి తీర్చడంతో పాటు వారి ఖాతాల్లో ప్రత్యక్షంగా కొంత డబ్బును జమ చేస్తామని చెప్పారు. కిసాన్ సమ్మాన్ నిధి హామిలో భాగంగా.. మొదటి వాయిదాగా రూ.2వేలను రైతుల ఖాతాల్లో వేయనున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద మొత్తం 8.69కోట్ల రైతులు లబ్ది పొందుతారు. అలాగే సంఘటిత కార్మికులు.. కూలీ, నాలి చేసుకొనే వారు, కార్మికులు, నిరుద్యోగులు.. ఇలా ప్రతొక్కరిపై కరోనా ప్రభావం చూపుతుండగా.. రైతులకు.. వితంతువులకు, పెన్షనర్లు, దివ్యాంగులు.. జన్ ధన్ యోజన ఖాతాధారులకు.. ఉజ్వల స్కీమ్... నేషనల్ రూరల్.. ప్రతి ఒక్కరికి నగదు ఇచ్చేందుకు కేంద్రం ప్రణాళికలు వేసింది.  

* దేశవ్యాప్తంగా 8.69 కోట్ల మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ఏప్రిల్ మొదటి వారంలో రూ .2,000.

*  గ్రామీణ ఉపాధీ పథకం కింద దేశవ్యాప్తంగా వున్న 5 కోట్ల మందికి వేతనాన్ని రూ .182 నుంచి రూ .202 కు పెంచిన కేంద్రం. ఒక్కో కార్మికునికి రూ .2000 లభ్ది.  

* వృద్ధులు/ వితంతువులు: వృద్దులు,దివ్యాంగులకు ప్రతీ నెలా ఎక్స్‌గ్రేషియా కింద రూ.1000 చెల్లించనున్నారు. 3 కోట్ల మంది ప్రయోజనం

* దేశంలోని 20 కోట్ల మంది మహిళా జన ధన్ ఖాతాలను కలిగిన మహిళలకు ప్రతీ నెలా వారి ఖాతాలో రూ.500 చొప్పున వచ్చే మూడు నెలల పాటు జమ .

* దేశవ్యాప్తంగా 8.3 కోట్ల మంది మహిళా ఉజ్జ్వలా స్కీమ్ లబ్ధిదారులకు మూడు నెలలు పాటు ఉచిత సిలిండర్లు.  

* డ్వాక్రా సంఘాలా బృందాలకు రుణపరిమితి రూ.10లక్షలకు పెంపు. దేశవ్యాప్తంగా 63 లక్షల స్వయం సహాయక బృందాలకు లబ్ధి.  

* వ్యవస్థీకృత రంగం: 100 మందికి తక్కువగా వుండే సంస్థల్లో.. రూ.15వేల లోపు జీతం వున్న వారికి ఉద్యోగి, యజమాని ఈఫీఎఫ్ వాటాను 3 నెలల పాటు చెల్లించనున్న కేంద్రం.

* లాక్ డౌన్ నేపథ్యంలో భవనం మరియు నిర్మాణ కార్మికుల కోసం రూ .31,000 కోట్లు ఉన్న సంక్షేమ నిధిని ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు

* పరీక్షా కార్యకలాపాలు, మెడికల్ స్క్రీనింగ్, కరోనావైరస్ మహమ్మారిపై పోరాడటానికి అవసరమైన ఆరోగ్య దృష్టిని అందించడానికి జిల్లా నిధులను ఉపయోగించుకునేలా ఆదేశాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles