Apple techie Rohita denies to come to Hyderabad సాఫ్ట్ వేర్ ఉద్యోగిని రోహిత కేసులో మరో ట్విస్టు..

Missing apple india techie rohitha denies to come to hyderabad

new twist in Rohitha case, Software Engineer Employee, Software Engineer Employee Rohita, Software Engineer Employee, Rohita Found In Pune, Pune, Missing Software Engineer Employee, Rohitha, Missing Software Employee Rohitha, Hyderbad, Pune, cyberabad police, Telangana, Crime

Missing Hyderabad Apple India techie, Rohitha Kuthuru has been found in Pune, Maharastra, but a new twist took in this case. The 34-year-old Apple techie went missing from Hyderabad on December 26, 2019, appeals police to leave her at peace in pune. After she had a disturbances with her family.

సాఫ్ట్ వేర్ ఉద్యోగిని రోహిత కేసులో మరో ట్విస్టు..

Posted: 01/16/2020 11:35 AM IST
Missing apple india techie rohitha denies to come to hyderabad

నగరంలో సంచలనంగా మారిన సాఫ్ట్ వేర్ మహిళ టెక్కి రోహిత కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. అయితే అంతా సవ్యంగానే ముగిసిందని భావిస్తున్న తరుణంలో ఈ కేసులో మరో ట్విస్టు ఎదురైంది. దీంతో అమె ఆచూకీని కనిపెడుతూ వెళ్లిన పోలీసులకు నిరాశే ఎదురైంది. ఇంతకీ ఏమిటీ ట్విస్టు.. ఎందుకు నిరాశ అంటున్నారా.? కుటుంబ కలహఆలతోనే అమె ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు అమె గచ్చిబౌలి పోలీసులకు తెలిపారు. అయితే ఎవరికీ చెప్పకుండా వెళ్లడంతో అమె కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గత 20 రోజులుగా కనిపించకుండా అమె ఆచూకీ తెలుసుకున్న పోలీసులు అమెను హైదరాబాద్ కు తీసుకురావడంలో మాత్రం కొత్త ట్విస్ట్ ఏర్పడింది. రోహిత ఆచూకీని పూణేలో వున్నట్లు కనుగొన్న పోలీసులు ఆమెను క్రితం రోజు సాయంత్రం వరకు హైదరాబాద్ తీసుకురానున్నారని ప్రచారం జరిగింది. సాయంత్రం ఆమెను తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారని భావించారు. అయితే మిస్సింగ్ మిస్టరీని ఛేదించిన పోలీసులకు మరో సవాల్ ఎదురయింది. అదేంటంటే ఆమె హైదరాబాద్ వచ్చేందుకు ససేమిరా అంటోంది.

తాను పూణేలోనే ఉంటానని గచ్చిబౌలి పోలీసులకు ఆమె వివరణ ఇచ్చినట్టుగా చేబుతున్నారు. దీంతో సాయంత్రంలోగా ఆమెను హైదరాబాద్ తరలించి బంధువులకు అప్పగిద్దామనుకున్న పోలీసులు తల పట్టుకున్నారు. తనను ప్రశాంతంగా పూణేలోనే బతకనివ్వండని పోలీసులతో రోహిత మొర పెట్టుకున్నట్టు చెబుతున్నారు. దీంతో చేసేది ఏమీ లేక ఈ సమాచారం బంధువులకు చేరవేసిన గచ్చిబౌలి పోలీసులు ఏమి చేయాలో అర్ధం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే రోహిత పూణేలోనే ఉంటుందా? లేదా హైదరాబాద్ వస్తుందా అనేది పూర్తిగా ఆమె ఇష్టం మీద ఆధార పడి ఉంది. ఏదేమైతేనేమి ఆవిడ అయితే సేఫ్ కదా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohitha  missing apple techie  missing software employee  Hyderbad  Pune  cyberabad police  Telangana  Crime  

Other Articles