CBI court convicts rape accused after swift trial అత్యాచార కేసులో దోషికి ‘‘ఉరిశిక్ష’’

Special cbi court convicts ranchi s nirbhaya rape murder accused after swift trial

CBI court in Ranchi, Unnao rape case, Unnao rape accused, Kuldeep Sengar, Nirbhaya case, Special CBI Judge, A.K. Mishra, Nirbhaya rape case, Nirbhaya, engineering student, "Ranchi's Nirbhaya" CBI Judge AK Mishra, cbi, rahul raj, tir, nirbhaya, ranchi, Crime

A special CBI court in Ranchi on Friday convicted a 23-year-old habitual offender, Rahul Raj, for the rape and murder of an engineering student, on the fourth anniversary of Delhi's Nirbhaya case, in a swift trial that was completed in a little over a month, officials said.

న్యాయస్థానం సంచలన తీర్పు: అత్యాచార కేసులో దోషికి ‘‘ఉరిశిక్ష’’

Posted: 12/21/2019 07:05 PM IST
Special cbi court convicts ranchi s nirbhaya rape murder accused after swift trial

ఓ ఇంజినీరింగ్ విద్యార్ధిని అత్యాచారం, హత్య కేసులో నిందితుడిని దోషిగా తేల్చిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. రాంచీ నిర్భయ కేసుగా గుర్తింపు పోందిన ఈ కేసులో నిందితుడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం అతడికి మరణశిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అభియోగాలు మోపిన తర్వాత కేవలం నెల రోజుల్లో విచారణ పూర్తిచేసిన రాంచీ కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. ఉన్నావ్ అత్యాచార కేసులో ఎమ్మెల్యే కుల్దీప్ సెన్గార్ ను దోషిగా తేల్చిన తరువాత ఈ కేసులోనూ నేరం రుజువుకావడంతో సీబిఐ మరో గౌరవాన్ని అందుకున్నట్లు అయ్యింది.

‘నిర్భయ’ ఘోరానికి సరిగ్గా నాలుగేళ్లు నిండిన రోజే 2016 డిసెంబర్ 16న రాహుల్ కుమార్ అనే మానవ మృగం రాంచీలోని ఓ ఇంజినీరింగ్ విద్యార్ధినిపై అత్యాచారం చేసి చంపేశాడు. రాంచీలోని బూటీ బస్తీకి చెందిన రాహుల్ రాజ్ అనే పైశాచిక మృగం కన్ను.. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి పై పడింది. ఓరమాంఝీ ప్రాంతంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం ఇంజనీరింగ్ చదవుతున్న విద్యార్థిని ఒంటరిగా వుంటున్న విషయం తెలుసుకున్న రాహుల్ రాజ్ డిసెంబర్ 15వ రాత్రి అమె ఇంట్లోకి వెళ్లి అత్యాచారం చేసి ఆ తరువాత అమెను చంపేశాడు.
 
అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు, విస్తృత గాలింపు అనంతరం గతేడాది జూన్‌లో నిందితుడిని లక్నోలో అరెస్ట్ చేశారు. అప్పటికే అతడు మరో నేరంలో జైలుకెళ్లి శిక్ష అనుభవిస్తున్నాడు. అక్టోబర్ చివరి వారంలో కోర్టు అతడిపై అభియోగాలు మోపింది. 30 మంది సాక్షులను క్షణ్ణంగా విచారించిన కోర్టు... అనంతరం మరో 16 రోజుల్లో తీర్పుతో ముందుకొచ్చింది. సరిగ్గా ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యేకి యావజ్జీవ కారాగార శిక్ష పడిన రోజే.. రాజ్‌ను సీబీఐ కోర్టు దోషిగా ప్రకటించింది. బీహార్‌లోని నలందకు చెందిన నిందితుడు రాహుల్‌ రాజ్‌కు మరణశిక్ష విధిస్తూ ఇవాళ తీర్పు వెలువరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles