MRO Vijaya Reddy Case Accused Suresh Passed Away తహశీల్దార్ విజయారెడ్డి హత్యకేసు నిందితుడు సురేష్ మృతి

Mro vijaya reddy case accused suresh passed away

Vijaya Reddy, Tehsildar attack, Abdullapurmet MRO, Suresh Mudhiraj, durgaiah, land controversy, realtors skecth, realtors beyond vijaya reddy brutal murder, Pass book, petrol, Sabitha Indra Reddy, Rangareddy, Hyderabad’s Outer Ring Road, Telangana Crime

Suresh the main accused in the murder of the Tahsildar Vijaya Reddy died while undergoing a medical treatment in Osmania hospital. He also suffered severe burns and was undergoing treatment for the past four days.

తహశీల్దార్ విజయారెడ్డి హత్యకేసు నిందితుడు సురేష్ మృతి

Posted: 11/07/2019 11:05 AM IST
Mro vijaya reddy case accused suresh passed away

హైదరాబాద్ నగరశివారుల్లోని అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం కేసులో నిందితుడిగా వున్న సురేష్ ముదిరాజ్.. అసుపత్రిలో చికిత్స పోందుతూ ఇవాళ మృతి చెందాడు. ఎమ్మార్వో విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించి, తీవ్రంగా గాయపడ్డ సురేష్.. ఆ తరువాత తాపీగా నడుచుకుంటూ వెళ్లి స్థానిక అసుపత్రిలో చేరాడు. అయితే నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి ఉస్మానియా అసుపత్రికి తరలించి చికిత్సనందించారు.

ఉస్మానియా అసుపత్రిలో చేరిన నాటి నుంచి మృత్యువుతో పోరాడుతున్న సురేష్ ఇవాళ కన్నుమూశాడు. కాసేపట్లో అతని మృతదేహాన్ని మార్చురీకి తరలించనున్నారు. పోస్టుమార్టం తరువాత సురేష్ ను మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందించనున్నారు. ఓ భూమికి సంబంధించి పట్టా ఇవ్వలేదనే ఆగ్రహంతోనే తాను ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు సురేశ్‌ మెజిస్ట్రేటుకు వాంగ్మూలం ఇచ్చాడు. అలాగే  తనపై తానే  పెట్రోల్ పోసుకున్నట్లు చెప్పాడు. ముఖం, ఛాతీ కాలిపోవటంతో అతడు చికిత్సకు స్పందించలేదని సమాచారం.

అయితే సురేష్ మరణంతో ఎమ్మార్వో హత్యకేసు వెనుకనున్న రియల్టర్ పెద్దలు ఎవరన్న విషయాలు వెలుగులోకి వచ్చేనా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సురేష్ మతి స్థిమితం లేని వ్యక్తి అని జరిగిన ప్రచారాన్ని నిందితుడి తండ్రి క్రిష్ణ తోసిపుచ్చాడు. అయితే తన కొడుకును పావుగా వాడుకుని ఎవరో కావాలని అతన్ని ఉపిగొల్పారని క్రిష్ణ అనుమానాం వ్యక్తం చేశారు. కాగా సురేష్ మరణించినా.. అతనిచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఈ కేసును సవాల్ గా తీసుకోనున్నారు. ఎమ్మార్వో హత్యకు కుట్రపన్నిన రియల్ పెద్దలను కటకటాల వెనక్కి నెట్టనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijaya Reddy  Tehsildar attack  Abdullapurmet MRO  Suresh  Durgaiah  realtors skecth  Telangana Crime  

Other Articles