SIMI terrorist arrested at Hyderabad airport హైదరాబాద్ విమానాశ్రయంలో సిమీ ఉగ్రవాది అరెస్ట్

Wanted simi operative held in bodh gaya and patna blasts case

SIMI terrorist, 2013 Bodhgaya blast, Patna bomb blast, Azharuddin, Chemical Ali, Anti- Terrorism Squad, Saudi Arabia, Hyderabad airport, Crime

Suspected SIMI terrorist Azharuddin alias Azhar alias Chemical Ali was arrested Chhattisgarh Anti- Terrorism Squad (ATS) after he landed from Saudi Arabia at Hyderabad airport.

హైదరాబాద్ విమానాశ్రయంలో సిమీ ఉగ్రవాది అరెస్ట్

Posted: 10/12/2019 06:45 PM IST
Wanted simi operative held in bodh gaya and patna blasts case

హైదరాబాద్ నగరంలో మరోసారి ఉగ్ర కలకలం చోటు చేసుకుంది. శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో సిమీ ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన కెమికల్ అలీ అలియాస్ అజహరుద్దీన్ వల వేసి పట్టుకున్నారు. అతడు కుటుంబ సభ్యులను కలిసేందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. పక్కా సమాచారంతో ఛత్తీస్ గఢ్ పోలీసులు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం ఛత్తీస్ గఢ్ కు తీసుకెళ్లారు.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉగ్రవాది అరెస్టు నేపథ్యంలో నగరంలో పోలీసులను అప్రమత్తం చేశారు. నగరంలో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కెమికల్ అలీ అలియాస్ అజహరుద్దీన్ 2013లో పాట్నా, బోధ్‌గయలో జరిగిన బాంబు పేలుడులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. రాయ్‌పూర్‌కు చెందిన అజరుద్దీన్ 2013 పేలుళ్ల అనంతరం సౌదీ అరేబియాకు పారిపోయాడు. అక్కడ ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నట్లు సమాచారం. నాటి కేసులో ఇప్పటివరకు 17 మందిని అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SIMI terrorist  Bodhgaya blast  Patna bomb blast  Azharuddin  Saudi Arabia  Hyderabad airport  Crime  

Other Articles