TSRTC employees continue strike on 8th day వీలినం కుదరదు.. ప్రత్యామ్నాయాలు సిద్దం: మంత్రి పువ్వాడ

Govt rules out rtc tsrtc merger as workers continue their indefinite strike

telangana transport minister, puvvada ajay kumar, new employeed in rtc, rtc tsrtc merger, TSRTC Srike, TS Employees, CM KCR, employees termination, RTC Unions, RTC workers, Telangana

The Telangana government ruled out a merger of Road Transport Corporation with the on Telangana State Road Transport Corporation as TSRTC workers continued their indefinite strike.

వీలినం కుదరదు.. ప్రత్యామ్నాయాలు సిద్దం: మంత్రి పువ్వాడ

Posted: 10/12/2019 03:41 PM IST
Govt rules out rtc tsrtc merger as workers continue their indefinite strike

తమ న్యాయమైన డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని తెలంగాణలొ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఎనవిదవ రోజుకు చేరుకుంది. దీంతో ఇవాళ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మరోసారి స్పందించిన ప్రభుత్వం... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేస్తూ.. ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు, ప్రత్యామ్నాయ చర్యలను మీడియాకు వివరించారు. సమ్మెలో 5 వేలకు పైగా బస్సులు నడుపుతూ ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూస్తున్నామన్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చలేదని, సీఎం కేసీఆర్ కూడా ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. దసరా పండుగ సందర్బంగా సొంత ఊళ్లకు వెళ్లే పరిస్థితుల్లో, ప్రజలకు అసౌకర్యం కల్పించాలనే ఉద్దేశ్యంతో యూనియన్లు చేసిన ప్రయత్నాన్ని ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సమర్థవంతంగా ఎదుర్కొందన్నారు. ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడం.. తిరిగి వారిని క్షేమంగా ఇళ్లకు చేర్చడంలో విజయవంతం అయ్యామన్నారు.

ప్రధానంగా సంప్రదింపుల ప్రక్రియ ముగియకముందే.. సమ్మెని ప్రజల మీద బలవంతంగా రుద్దారన్నారు. మధ్యలోనే వెళ్లిపోయింది కార్మిక సంఘ నేతలేనని ఆయన అన్నారు. సమ్మె చట్టవిరుద్ధమైందని మరోసారి వ్యాఖ్యానించారు. 2 వేల 969 ఆర్టీసీ బస్సులు, హైయ్యర్ బస్సులు 15 వందల 88, ప్రైవేటు బస్సులు 798, ఇతర ప్రైవేటు వాహనాలు 2 వేల వాహనాలతో నడపడం జరుగుతోందన్నారు. ఇక్కడ ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు.

ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెకు విపక్షాలు కేవలం రాజకీయ ప్రయోజనాన్ని అశించడం మినహా ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేశారా అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్పొరేషన్ లాగానే ఉందన్నారు. అసంబద్ధమైన విమర్శలు చేస్తున్న పార్టీలను ప్రజలు ఈసడించుకుంటున్నారని పువ్వాడ అజయ్ విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSRTC Srike  TS Employees  CM KCR  employees termination  RTC Unions  RTC workers  Telangana  

Other Articles