తాము ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలిపోతుందని తెలిస్తే.. ఎవరైనా అందోళనకు చెందుతారు. ఇక ఇవే తమకు చివరి క్షణాలని కూడా భావిస్తారు. నమ్మినవారు. నమ్మనివారు అంతా దేవుణ్ణి ప్రార్థించి, తమను కాపాడమని, లేదా విమానం క్రాష్ కాకుండా చూడాలని మొక్కుతారు. కానీ ఈ విమానంలోని ప్రయాణికులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. నవ్వుకుంటూ సెల్ఫీలు తీసుకున్నారు. పైలట్‌తో సహా అంతా ఉల్లాసంగా కనిపించారు. ఇదేం చోద్యం అనుకుంటున్నారా?
ఇదిగో ఈ వీడియో చూస్తే మీరు కూడా షాకవుతారు. ప్రమాదాన్ని కూడా వీరు పండగలా ఫీలవ్వుతున్నారే అని ఆశ్చర్యపోతారు. ఓవెన్ లైపెల్ట్ అనే పైలట్ బీచ్‌క్రాఫ్ట్ బొనాంజ అనే లైట్ ఎయిర్ క్రాఫ్ట్‌లో ప్రయాణికులతో విహారానికి బయల్దేరాడు. మార్గ మధ్యలో ఆ విమానం ఇంజిన్ ఫెయిలైంది. దీంతో విమానాన్ని నేరుగా పసిఫిక్ మహాసముద్రంలో ముంచేశాడు. అనంతరం మునిగిపోతున్న ఎయిర్ క్రాఫ్ట్తో సెల్ఫీలు తీసుకున్నాడు.
మరోవైపు ప్రయాణికులు సైతం ప్రమాదాన్ని ఎంజాయ్ చేయడం కనిపించింది. నీటిలో తేలుతూ సెల్ఫీ వీడియోల్లో మాట్లాడుతూ.. సరదాగా గడిపేశారు. ఈ ప్రమాదం కాలిఫోర్నియాకు తొమ్మిది మైళ్ల దూరంలోనే జరిగింది. దీంతో రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని నీటిలో లైఫ్ జాకెట్ల సాయంతో తేలుతున్న ప్రయాణికులను, పైలట్‌ను రక్షించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more