IMD Rain Forecast in AP, Telangana బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగురాష్ట్రాలకు వర్ష సూచన

Deep depression to trigger rains over telugu states

Bay of Bengal, Telangana, Telangana weather, Telangana rains, Rains in Andhra Pradesh, Krishna, Godavari, Karnataka, Maharashtra, Rains in Urbab Andhra, Rains in Rural Andhra, Rains in Andhra pradesh, Rains in Telangana, Rain Forecast

Rains will likely prevail over isolated parts of both Telangana and Andhra Pradesh as a depression occure in bay og bengal. Fishermen were advised not to venture into Bay of Bengal over the next 24 hours.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగురాష్ట్రాలకు వర్ష సూచన

Posted: 08/10/2019 11:07 AM IST
Deep depression to trigger rains over telugu states

తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు కాస్త శాంతించాడని అనుకునే లోపు సముద్రుడు మళ్లీ నేనుండగా.. ఎడతెరపి తీసుకుంటారా.? అన్నట్లు కన్నెర్ర చేస్తున్నాడు. ఇప్పటికే వారం రోజుల పాటు కుండపోతలా కురిసిన భారీ వర్షాలతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, వాగులు, వంకలతో పాటు కాలువల్లో కూడా వరద నీరు పోటెత్తింది. గోదావరి, కృష్ణా, వంశధార, నాగవళి నదులు వరద నీటితోపరవళ్లు తొక్కుతున్నాయి.

ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. ఇక ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు కూడా భారీగా వుండటంతో ప్రాజెక్టుల్లోని నీటిని కూడా కిందకు వదిలేస్తున్నారు. ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ నాలుగు గేట్లు తెరచి నీటిని వదిలారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ముంపు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం ఎక్కడా భారీ వర్షాలు కురవలేదని, 118 ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది.

అయితే తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 12న బంగాళాఖాతంలోని వాయువ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, ఇది తర్వాత బలపడి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని స్పష్టం చేసింది. శని, ఆదివారాల్లో అనేకచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మధ్యప్రదేశ్ సమీపంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావ తెలంగాణపై లేదని స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bay of Bengal  Telangana  Andrha pradesh  Deep depression  IMD  Rain Forecast  

Other Articles