Suman Rao from Rajasthan Crowned Miss India 2019 మిస్ ఇండియా వరల్డ్ 2019గా రాజస్థాన్ సుమన్ రావు..

Telanganas sanjana vij was adjudged as miss india runner up 2019

Suman Rao, Suman Rao miss india world, Suman Rao miss india world 2019, miss india world 2019, miss india 2019 winner, Manushi Chhillar, karan johar, Vanessa Ponca de leon, Sanjana Vij, Telangana

Suman Rao, a CA student from Rajasthan, emerged the winner of Miss India World 2019. Rao said she is honoured and happy to have won the title. Telangana's Sanjana Vij was adjudged as Miss India Runner Up 2019.

మిస్ ఇండియాగా రాజస్థాన్ సుమన్ రావు.. రన్నర్ అప్ గా తెలంగాణ సంజన

Posted: 06/17/2019 03:26 PM IST
Telanganas sanjana vij was adjudged as miss india runner up 2019

మిస్ ఇండియా వరల్డ్ 2019 పోటీల్లో సౌందర్య కిరీటం రాజస్థాన్ యువతి వశమైంది. ముంబైలోని సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన  అందాల పోటీల్లో సీఏ చదువుతున్న సుమన్ రావు మిస్ ఇండియా-2019 కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ అపురూపమైన విజయం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.  పట్టుదల ఉంటే ఎటువంటి పరిస్థిత్తుల్లోను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉంటే విజయం దక్కించుకోవచ్చన్నారు.

ఈ ఆత్మవిశ్వాసంతోనే  డిసెంబర్లో బ్యాంకాక్ లో జరుగనున్న మిస్‌ వరల్డ్‌ పోటీల్లో కూడా పాల్గొంటానని తెలిపారు. తనను వరించిన కిరీటంతో పాటు మిస్ వరల్డ్ కిరీటాన్ని కూడా తన వద్దే అట్టిపెట్టుకునేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపింది. ఈ పోటీల్లో మిస్‌ గ్రాండ్‌ ఇండియాగా ఛత్తీస్ గఢ్ కు చెందిన ఇంజినీర్‌ శివాని జాదవ్‌ నిలవగా.. బిహార్ రాష్ట్రానికి చెందిన మేనేజ్ మెంట్ విద్యార్ధిని శ్రేయా శంకర్ విస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ 2019 టైటిల్ ను గెలుచుకున్నారు.

కాగా, తెలంగాణకు చెందిన సంజనా విజ్‌ మిస్‌ ఇండియా రన్నరప్‌గా నిలిచారు. సంజనా విజ్  యూపీలోని అమితీ యూనివర్సిటీలో బయో టెక్నాలజీలో ఎం.టెక్‌ చదువుతోంది. మిస్ ఇండియా 2019ను ఎంపిక చేసే ప్యానెల్ కమిటీలో.. ప్రముఖ డిజైనర్ ఫాల్గునీ షేన్ పికాక్, మిస్ వరల్డ్ 2018 వెనెస్సా పొన్కా డి లియాన్, నటులు హ్యూమా ఖురేషీ, చిత్రంగదా సింగ్, అయుష్ శర్మ, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా, క్రీడాకారులు డుటీ చంద్, టీమిండియా ఫుల్ బాల్ కెప్టెన్ సునీల్ ఛట్రీ తదితరులు పాల్గోన్నారు. ఇదిలావుండగా,  న్యాయమూర్తులు శరీరవర్ణాన్ని మార్కులు వేశారన్న విమర్శలు కూడా వినిపించడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suman Rao  miss india world 2019  Manushi Chhillar  karan johar  Sanjana Vij  Telangana  

Other Articles