Pawan's poll expenditure for Gajuwaka గాజువాకలో పవన్ కల్యాణ్ ఎన్నికల ఖర్చు ఎంతంటే..!

Pawan kalyan s poll expenditure for gajuwaka assembly

pawan kalyan, janasena, Pawan Kalyan Gajuwaka, Pawan Kalyan poll Expences, Gajuwaka assembly, pawan kalyan JanaSena, Gajuwaka pawan kalyan poll expences, pawan kalyan gajuwaka poll expences, Gajuwaka Assembly constituency, andhra pradesh, politics

Actor turned Politician, Janasena party Chief Pawan Kalyan, Who contested the assembly elections from Gajuwaka of vishaka had spent just Rs 8 lakhs, reveals an expenditure statement submited by his party to Election Commission. Pawan stated that he had spent Rs 8,39,790.

గాజువాకలో పవన్ కల్యాణ్ ఎన్నికల ఖర్చు ఎంతంటే..!

Posted: 05/15/2019 01:17 PM IST
Pawan kalyan s poll expenditure for gajuwaka assembly

దేశంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని నిర్వహించడంతో పాటు.. తెరచాటుగా అనేక రకాల తాయిలాలను కూడా తమ నియోజకవర్గంలోని ఓటర్లకు పంచారని సమాచారం. ఈ క్రమంలో ఒక్కో నియోజకవర్గంలో యాభై కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా అభ్యర్థులు ఖర్చుచేశారని ఏకంగా టీడీపీ సీనీయర్ నేత అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనం.

రాష్ట్రం కన్నా ఎక్కువగా రాజకీయ పార్టీలకు అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతోనే ఎన్నడూ లేనంతగా డబ్బు ఏరులై పారిందనే వార్తలు వినబడుతున్నాయి. ఎన్నికలలో ఓటర్లు తమకు ఓటు వేసేందుకు కొందరు వెండి కంచాలను పంచితే మరికోందరు ఏసీలు, ఆనడ్రాయిడ్ టీవీలు, మరికొందరు బంగారం.. ఇంకోందరు ఏకంగా నగదు, ఇక మురికివాడల్లో నగదుతో పాటు ప్రతీ రోజు అడిగిన వారికి అడిగినంత మద్యం కూడా అందించారన్న వార్తలు వినిపించాయి. ఇందుకోసం వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు కోట్లాది రూపాయలను ఖర్చు చేశారనేది జగమెరిగిన సత్యం.


అయితే రాష్ట్రంలో సినీనటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలో తృతీయ ప్రత్యామ్నాయంగా అవిర్భవించిన జనసేన పార్టీ మాత్రం కొన్ని సిద్దాంతాలకు కడుబడి, నైతిక విలువలకు లోబడి వున్న పార్టీ అని అందరికీ తెలసిన విషయమే. పైసా ఖర్చు లేకుండా పవన్ కల్యాణ్ సభలకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఉప్పెనలా తరలివచ్చారన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రత్యర్థి పార్టీల నేతల సభలకు, దీక్షలకు పాదయాత్రలకు ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల జేబులు ఖాళీ అయ్యాయన్న వార్తలు వినిపించిన క్రమంలో ఏదో చిన్నచితకా ఖర్చుల మినహా పవన్ కల్యాణ్ సభలు జరిగిన తీరు, హాజరైన అభిమానులను చూస్తే జాతీయ మీడియానే ఆశ్చర్యపడేలా చేసింది.

ఇది రాష్ట్రంలోని పవన్ కల్యాణ్ మార్క్ ఇమేజ్ అని.. కొత్తగా ఓటు హక్కు లభించిన ఓటర్లలలో అత్యధిక శాతం పవన్ కల్యాణ్ కు అభిమానులుగా వున్నారన్న విషయం కూడా జాతీయ మీడియా సర్వేలలో తేలింది. ఇదంతా ఇప్పుడెందుకు అంటారా.? ఇలాంటి అభిమానులు వున్న ఏ నాయకుడు కూడా డబ్బులు వెచ్చించాల్సి రాదు. ఒక వేళ వచ్చినా.. అది కేవలం ప్రచారం కోసమే తప్ప.. తాయిలాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. తాజాగా పవన్ కల్యాన్ పోటీ చేసిన గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేనాని ఖర్చు చేసిన లెక్కలు ఈ విషయాన్నే తేల్చిచెబుతున్నాయి.

వాస్తవానికి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులకు రూ. 28 లక్షలు, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులకు రూ. 70 లక్షల వరకు వ్యయ పరిమితి ఉంది. అయితే అభిమానులే బలంగా వున్న తనకు కనీసం ఎన్నికల సంఘం నిబంధలన మేరకు రూ.28 లక్షల రూపాయలను కూడా ఖర్చుచేయాల్సిన అవసరం రాలేదని జనసేన వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఎన్నికల సంఘం అధికారులకు సమర్పించిన ఆయన ఎన్నికల ఖర్చు కింద కేవలం రూ. 8,39,790 ఖర్చు చేసినట్టు చూపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  Gajuwaka  Poll Expences  andhra pradesh  politics  

Other Articles